కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ కొత్త సంవత్సరంలో కూడా ఎప్పటిలాగానే వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీ కానుంది టీమ్ ఇండియా జట్టు. అదే సమయంలో ఇక ఏడాది భారత్ వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వన్డే వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిపోతుంది టీమిండియా జట్టు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించబోతుంది  అని అటు అభిమానులకు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు అని చెప్పాలి. అదే సమయంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకంగా మారబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 2023 వన్డే వరల్డ్ కప్ కు సంబంధించి ఇప్పటినుంచి ఎంతో మంది మాజీ ఆటగాళ్,లు సీనియర్లు కూడా రివ్యూలు ఇచ్చేస్తున్నారు.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా వెటరన్   ప్లేయర్ దినేష్ కార్తీక్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి టీమిండియా కు ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్గా వ్యవహరించారు. అయితే అందరిలో కెల్లా ఫేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తానేంటో నిరూపించుకున్నాడు. గుజరాత్ ను విజేతగా నిలిపాడు. ఇక రోహిత్ శర్మ తర్వాత వైట్ బాల్ కెప్టెన్ గా అయ్యే అవకాశాలు కేఎల్ రాహుల్ కంటే హార్దిక్ పాండ్యాకే ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే వైస్ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ తో పోటీ పడుతున్నాడు హార్థిక్ పాండ్యా. ఇక తప్పకుండా రోహిత్ కు డిప్యూటీగా పాండ్య నే ఉంటాడు అంటూ దినేష్ కార్తీక్  చెప్పుకొచ్చాడు.


 ఇటీవల టి20 వరల్డ్ కప్ కప్ లో భాగంగా ఇక హార్దిక్ పాండ్యా ప్రదర్శన కూడా అత్యుత్తమ స్థాయిలో ఉంది అంటూ దినేష్ కార్తీక్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్ కాదు హార్దిక్ పాండ్యా నే వైస్ కెప్టెన్ గా కొనసాగుతాడని ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే ఇక కెప్టెన్సీ బాధ్యతలను కూడా చేపట్టేది పాండ్యనే అని అంచనా వేశాడు దినేష్ కార్తీక్. అయితే మరికొన్ని రోజులలో పరిమిత ఓవర్ల  ఫార్మాట్ కు హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ వహించబోతున్నాడు. రోహిత్ ని కేవలం టెస్ట్ ఫార్మాట్ కి మాత్రమే పరిమితం చేస్తారు అని ప్రచారం జరుగుతూన్న నేపథ్యంలో దినేష్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: