గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా జట్టు ద్వైపాక్షిక   సిరీస్లలో ఎంత సత్తా చాటుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉన్నా సరే తమకు తిరుగులేదు అనే విధంగానే ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలో  కూడా సత్తా చాటుతూ వరుసగా సిరీస్లను కైవసం చేసుకుంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత పర్యటనకు ఆస్ట్రేలియా రాగా ఇక సొంతగడ్డపై పూర్తి ఆదిపత్యాన్ని చలాయిస్తుంది  టీమిండియా. ఇప్పటికే భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డే సిరీస్లో హోరాహోరీ గా తలబడుతుంది. అయితే అటు టెస్ట్ సిరీస్ గెలుచుకున్న జోరునే వన్డే సిరీస్ లో కూడా చూపించింది. మొదటి వన్డే మ్యాచ్ లో కూడా ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీం ఇండియా బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో ఇక ఆస్ట్రేలియా జట్టు తక్కువ పరుగులకే కుప్పకూలిపోయింది. 188 పరుగులకే కంగారుల జట్టు కంగారు పడి ఆల్ అవుట్ అయిపోయింది అని చెప్పాలి. దీంతో గతంలో ఇండియా ఆస్ట్రేలియాపై   ఉన్న రికార్డును బద్దలు కొట్టారు అని చెప్పాలి. 2001లో భారత్ 35.5 ఓవర్లలో 181 పరుగులకే ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేసింది అని చెప్పాలి. ఇలా అత్యంత తక్కువ ఓవర్లలో ఆల్ అవుట్ చేసిన రికార్డును నెలకొల్పింది టీం ఇండియా. ఇక తాజాగా మొదటి వన్డే మ్యాచ్ 35.4 ఓవర్లకి అటు ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేసి చరిత్ర సృష్టించింది టీమ్ ఇండియా జట్టు అని చెప్పాలి. ఇలా అత్యంత తక్కువ ఓవర్లలోనే ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేసిన రికార్డును సృష్టించింది. అయితే ఇక ఈ మొదటి మ్యాచ్ ద్వారా  మొన్నటి వరకు ఫామ్ లేమీతో ఇబ్బంది పడి విమర్శలు ఎదుర్కున్న కేఎల్ రాహుల్.. 70కి పైగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: