మార్చ్ 31వ తేదీ నుంచి 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ అన్ని ఫ్రాంచైజీలు  కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పటిష్టమైన తుది జట్టుతో బరిలోకి దిగి ఇక టైటిల్ గెలవాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాయ్ అన్ని జట్లు. ఇలాంటి సమయంలో అటూ ఐపిఎల్ ప్రారంభానికి ముందే కొన్ని జట్లకు ఊహించని షాక్ లు తగులుతున్నాయ్. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో బిజీ షెడ్యూల్ కారణంగా ఎంతో మంది క్రికెటర్లు ఇక గాయాల బారిన పడుతూ ఉండడం జరుగుతూ ఉంది.


 వెరసి ఇక ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయలు కుమ్మరించి మరి జట్టుకు ఉపయోగపడతారు అని కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఇక గాయం బారిన పడి జట్టుకు దూరం అవుతూ ఉండడంతో ఆయా ఫ్రాంచైజీలకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి దెబ్బ మీద దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్య వెనునొప్పి గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక సర్జరీ అవసరమని వైద్యులు చెప్పడంతో ఐపీఎల్ టోర్ని మొత్తానికి కూడా అతను దూరమవుతాడు అన్నది తెలుస్తుంది.


 ఇక ఈ షాక్ నుంచి కోలుకునే లోపే అటు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యానికి మరో షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కివీస్ ఫాస్ట్ బౌలర్ ఫెర్గ్యూసన్ గాయం బారిన పడ్డాడు. ఇప్పటికే శ్రీలంకతో జరగబోయే తొలి వన్డే నుంచి అతను తప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది.  గాయం తీవ్రత పెద్దగా ఉంటే ఇక ఐపీఎల్ ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అనుమతించడం మాత్రం అనుమానమే అని చెప్పాలి. ఇలా కీలకమైన ఆటగాళ్లు గాయం బారిన పడుతూ దూరమవుతుండడంతో కోల్కతా జట్టు ప్రణాళికలు మొత్తం తారుమారు అవుతున్నాయని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl