జూనియర్ ఎన్టీఆర్ అంటే సాధారణంగా ఒక హీరో, ఒక స్టార్, ఒక ఇండియా స్టార్, ఒక బిగ్ స్టార్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. సినిమాలో నటించేటప్పుడు డబ్బులు తీసుకుని అకౌంట్‌లో వేసుకుని, తన బాధ్యతను పూర్తి చేస్తాడు. క్యారెక్టర్‌లోకి పూర్తిగా ఇమిడిపోతాడు. బాగా డైలాగులు చెప్తాడు, బాగా నటిస్తాడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఎలాంటి రోల్ ఇచ్చినా, ఎలాంటి డేంజరస్ సీన్ పెట్టినా, ఎన్టీఆర్ అది అవలీలగా చేసేస్తాడు. అలాంటి టాలెంట్ ఉన్న హీరో అంటే మనం జూనియర్ ఎన్టీఆర్ అని అందరూ చెబుతారు. కానీ ఆయనలో ఒక ప్రత్యేకమైన హిడెన్ టాలెంట్ ఉంది, అది అందరికీ అంతగా తెలియదు. ఆ టాలెంట్ ఏమిటంటే — ఎన్టీఆర్ స్టేజీ మీద మైక్ పట్టుకుని మాట్లాడితే, ఆయన మాటలు వినిపించే విధానం, మాట్లాడే స్టైల్, హృదయాన్ని తాకే పల్లె పలుకులు… ఇవన్నీ కలిసి ఆయనను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎదుట ఎంత పెద్ద స్టార్ ఉన్నా, ఆయనను ఇష్టపడని వాళ్లే అయినా సరే, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడితే వినక తప్పదు, మెచ్చుకోక తప్పదు.


ఇటీవల సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఆయనకు సంబంధించిన వీడియోలు, స్పీచులు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దానికి ముఖ్య కారణం — రీసెంట్‌గా జరిగిన కాంతార: చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ ఈవెంట్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజానికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. డాక్టర్లు కూడా ఆయనకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని కచ్చితంగా చెప్పారట. పైగా ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా బాగా హెల్త్‌పై ప్రభావం చూపించే విధంగా ఉన్నాయి. అయినా సరే, రిషబ్ శెట్టితో ఉన్న గట్టి ఫ్రెండ్షిప్ కారణంగా ఆయన తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఈ ఈవెంట్‌కి వచ్చేశారు.



జూనియర్ ఎన్టీఆర్ స్టేజ్‌పై అడుగు పెట్టగానే అభిమానులు జై జై ఎన్ టీఆర్ అంటూ అరుపులు మొదలు పెట్టారు ఫ్యాన్స్. కానీ ఆయన తన ప్రసంగం ప్రారంభించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి చేశారు. “నా ఆరోగ్యం  బాగోలేదు. నేను ఇంతకుముందులా గట్టిగా మాట్లాడలేను. కాబట్టి అర్థం చేసుకోండి” అని చెప్పారు. ఆయన మాటలు విన్న వెంటనే అభిమానులు కూడా చాలా కంట్రోల్‌గా, డిసిప్లిన్‌గా బిహేవ్ చేశారు. అసలు విషయం ఏంటంటే, కొన్ని రోజుల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ షూట్‌లో చిన్న గాయాలు అయ్యాయి. డాక్టర్లు పూర్తి విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయినప్పటికీ, తన ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ కోసం ఇంత రిస్క్ తీసుకుని రావడం అభిమానులను మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీలోని ఇతర స్టార్‌లను కూడా ఇంప్రెస్ చేసింది.



అతని మాటలు వినిపించే విధానం, అభిమానులను గౌరవిస్తూ చేసిన విజ్ఞప్తి, ఆ పరిస్థితుల్లో కూడా స్టేజ్‌పై నిలబడిన ధైర్యం — ఇవన్నీ చూసి జనాలు “ఇదే జూనియర్ ఎన్టీఆర్ నిజమైన మంచితనం” అని చెబుతున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో #RespectJrNTR అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు, ఒక నిజమైన స్నేహితుడు, అభిమానులను గౌరవించే వ్యక్తి, మరియు తన విలువలను నిలబెట్టుకునే వ్యక్తి అని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: