ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కు ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడిన వారు హీరోలు అవుతారు. ఎవరూ ఆయన్ని పొగుడుతూ మాట్లాడితే వారిని జీరోలు. ఎల్లో మీడియా కంకణం కట్టుకుని మరీ చూపిస్తున్నాయి. అయితే ఐఎఏస్ అధికారి రజత్ భార్గవ్ పై ఎల్లో మీడియా విషం కక్కిందనే చెప్పొచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ అని రాసుకొచ్చింది. అయితే కేంద్రంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా తన పరిధిలోని అంశం కాదని భార్గవ్ వివరణ ఇచ్చారు.


కేంద్ర ఆర్థిక శాఖలో కేంద్రం పరంగా, రాష్ట్రాల పరంగా అనేక రకాల అంశాలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో జాయింట్ సెక్రటరీ  ఉంటారు. కేంద్రంలో తాను జాయింట్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అవకాశం వచ్చి ఉంటే వదులుకునే వాడిని కాదని అన్నారు. అయితే రజత్ భార్గవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో అనేక కీలకాంశాలను వివరించారు.


ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర క్యాబినేట్ వేసిన ప్రణాళిక సంఘం కమిటీలో రజత్ భార్గవ్ ఉన్నారా లేరా? అని ఎల్లో మీడియా ప్రశ్నించింది. ఈ సమావేశాలకు జాయింట్ సెక్రటరీ హోదాలో ఆయన వెళ్లకపోవడమే ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం అవునా కాదా అని అడిగింది. అయితే దీనికి సంబంధించి జరిగిన రెండో సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని మాట్లాడిన ఒక వ్యక్తి గురించి రజత్ భార్గవ్ కు తెలియదా అని విమర్శలు చేసింది.


అయితే కేంద్రం చెప్పినట్లు చేయాల్సింది అక్కడి అధికారులు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే పార్లమెంట్ లోనే ప్రవేశపెట్టాలని అరుణ్ జైట్లీ అన్నారు. ఒక వేళ ఇక్కడ బిల్లు కాకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లినా కాదని చెప్పారు. అయితే అప్పుడు ఆయనపై ఆగ్రహంతో అందరూ మాట్లాడారు. కానీ అదే నిజమని తెలుసుకోలేక ఇప్పుడు బాధపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap