దీపారాధన.. హిందువుల పూజావిధానంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అయితే దీపారాధన ఎలా చేయాలన్నదానిపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి. దీపారాధన చేయాలంటే తలస్నానం చేయాలని చాలామంది భావిస్తారు.

ఇదే అనుమానంతో రోజూ దీపారాధన చేయడం మానేస్తున్నారు.. వివాహం అయిన స్త్రీలు నిత్యా దీపారాధనకి రోజూ తల స్నానం చేయవలసిన పని లేదు. మాములుగా స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరిస్తే నిత్యా దీపారాధన రోజూ చేసుకునే పూజ చేయవచ్చు.

ఆడవాళ్లకు పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది.. పాపటి లో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లి ని అక్కడ నిలుపుకొని పూజించి నట్టు అందువల్ల ఆడవాళ్లకు రోజూ తలస్నానం అవసరం లేదు. పాపటిలో కుంకుమ ధరిస్తే తల స్నానం చేసినట్టు.ఏదైనా వ్రతం ,పూజ, ముడుపు, దీక్ష లాంటివి ఉన్నపుడు మాత్రంతలస్నానం చేసే చేయాలి.. ఆడవారు బుధ, శనివారం, తలస్నానం చేయడం మంచిది, శుక్రవారం వ్రతాలు ఉన్నపుడు శుక్రవారం చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: