ఇదేంటి పండుగ వేళ.. ఈ శృంగారం కబుర్లు అంటారా.. ఔను.. ఇది నూటికి నూరు పాళ్లు నిజం.. సంక్రాంతి భార్యా భ‌ర్తల పండుగ‌. నిజం.. శాస్త్రాలు ఇదే విష‌యాన్ని నొక్కి చెబుతున్నాయి. అప్పటి వ‌ర‌కు ఉద్యోగ రీత్యానో.. ప‌నుల రీత్యానో దూరంగా ఉండే భార్యాభ‌ర్తలు.. సంక్రాంతి నాడు ఖ‌చ్చితంగా క‌లుసుకుని చేసుకోవాల్సిన పండుగ‌.

 

సంక్రాంతి అంటేనే పితృదేవ‌తల‌ను ఆరాధించుకునే పండుగ‌. మ‌రి మ‌న త‌ల్లిదండ్రులు కానీ తాత,ముత్తాత‌లు కానీ, మ‌న సంసార జీవితం బాగుంటేనే కదా... వారూ సంతోషంగా ఉంటారు. వారూ హ‌ర్షిస్తార‌ు.. ఈ విష‌యం మ‌నం గుర్తించాలి. ఓ జ‌త కొత్త బ‌ట్టలు క‌ట్టుకుని, ఓ సినిమాకు వెళ్లి పండ‌గ పూర్తయిందంటే పొర‌పాటే.

 

ప్రతి పండుగలోనూ అవి ఎలాగూ తప్పదు. వీటితోపాటు క‌లిసి చ‌క్కగా భోజ‌నం చేయాలి. రాత్రి వేళ భార్యాభ‌ర్తా.. క‌లిసి నిద్రించాలి. శృంగారంలోనూ పాల్గొనాలి. సంక్రాంతి నాటి రేయి.. పితృదేవ‌త‌లు త‌ర‌చి చూస్తారు. సంతాన వృద్ది చెందాల‌ని ఆశీర్వదిస్తారు. అందుకే సంక్రాంతి రాత్రి దంపతులకు మరో తొలిరాత్రి కావాలి.

 

ఆనాటి తీపి గుర్తులు నెమరేసుకుంటూ.. ఒకరిలో ఒకరు కరిగిపోవాలి. అప్పుడే మన పెద్దలకు తృప్తి. మన తరాలు అభివృద్ధి చెందే మార్గం కూడా ఇదే. సృష్టి కొనసాగినప్పుడే కదా.. ప్రకృతి కూడా పరవశించేది. ఏమంటారు.. ఇంకేం.. మీరూ ఈ రాత్రి మరో తొలిరేయి చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: