సంక్రాంతి వేళ భోగి స్నానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు తప్పకుండా అభ్యంగ‌న స్నానం చేస్తారు. భోగినాడు అల‌క్ష్మిని.. అంటే ద‌రిద్ర దేవ‌త‌ను పోగొట్టుకునేందుకు భోగినీళ్లతో స్నానం చేయ‌డం సంప్రదాయం అని చెబుతారు. అయితే, ఎవ‌రైనా అనివార్య కార‌ణాల రీత్యా భోగి నాడు అభ్యంగ‌న స్నానం చేయకపోతే ఏంచేయాలో చూద్దాం..

 

అసలు అభ్యంగన స్నానం అంటే ఏంటి.. కేవలం తలస్నానం కాదు. నువ్వుల నూనెను ఆపాద‌మ‌స్తకం రాసుకుని, కుంకుడుకాయ‌ల పులుసుతో స్నానం చేయ‌డాన్ని అభ్యంగన స్నానం అంటారు. ఈ కాలంలో కుంకుడు కాయల పులుసు ఎక్కడదని అడుగుతారా.. ఎలాగూ పండుగ వేళ పల్లెటూళ్లకు వెళ్తారు కాబట్టి అక్కడ కుంకుడు కాయలు బాగానే దొరుకుతాయి.

 

ఒక వేళ కుంకుడు కాయలు లేకపోతే..ఏం చేస్తాం.. షాంపూతో కానిచ్చేయడమే. అయితే నువ్వుల నూనె మాత్రం తప్పనిసరి. మరి ఎవరైనా ఈ అభ్యంగన స్నానం చేయడం మిస్ అయితే ఎలా .. ఏం పర్వాలేదు. భోగి స్నానం చేయడం కుదరని వారు.. సంక్రాంతి నాడు సూర్యోద‌యానికి ముందే అభ్యంగన స్నానం చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ రెమెడీ భోగి స్నానానికి మాత్రమే.. అలాగ‌ని చిన్నపిల్లల‌కు భోగి ప‌ళ్లు పోయ‌కూడదు సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: