ప్రతి సంవత్సరం మాఘమాస చతుర్ధశి తిథి కలిగిన రాత్రిని మాహశివరాత్రిగా భావించి పూజలు, అభిషేకాలు చేస్తాము. ఆరోజే శివుడి లింగ రూపాన ఉద్భవించాడనేది పురాణకథ. విశ్వమంతటా నిండి ఉన్నది శివుడే, ఆయన లయకారుడు, జగదేశ్వరుడు. అంటే భూమ్మీద ప్రతీ జీవి ఆయన ఆదీనంలోనే ఉంటాయి, అంతెందుకు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అయితే ఈ భోలాశంకరుడు అయిన పరమశివుడు శివలింగ రూపంలోకి ఎలా మారాడు..?? దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే...

 

బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు. ఒకరు సృష్టించేవారు,ఒకరు పాలించేవారు,ఇంకొకరు తనలో ఐక్యం చేసుకునే వారు.. అయితే పురాణ కథల ప్రకారం ఒక రోజు, ప్రళయ కాల సమయంలో బ్రహ్మకు, విష్ణువుకు, ఎవరు గొప్ప అని వాదన మొదలయింది. సృష్టించేవాడను నేను గనుక నేనే గొప్ప అని బ్రహ్మ, నాభి నుండి నువ్వు జన్మించావు గనుక నీకన్న నేనే గొప్ప అని ఇరువురు ఘర్షణ పడుతున్నారు. ఎంతకీ గొడవ తగ్గుముఖం పట్టడంలేదు, పైగా ఇంకా హెచ్చుగా వెళుతోంది. ఈ క్రమంలోనే..

 

వీరి తగువుని చూసి దేవతులందరు బయపడి, పరమశివుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు ఒక అగ్ని స్థంబ రూపంలో వారిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతిని చూసి ఆశ్చర్యంతో, గొడవ ఆపేసి దాని గురించి ఆలోచించడం మొదలుపెడతారు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్యోతి, దీని ఆధ్యాంతాలు తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నిర్ణయించుకున్నారు. అంతట విష్ణుమూర్తి వరాహ అవతారమున ఆదిని తెలుసుకోవడానికి నేలను తవ్వుకుంటూ వెళ్లారు, ఇక బ్రహ్మ దేవుడు హంస రూపాన అంతం తెలుసుకోవడానికి పైకి వెళ్లారు..

 

ఎంత ప్రయత్నించిన ఇద్దరు తెలుసుకోలేకపోయారు సరి కదా, బ్రహ్మ మొగలి పువ్వుతో అబద్దపు సాక్ష్యం చెప్పించి నేను అంతం చూశానని చెప్తాడు. అందుకే పరమశివుడి శాపానికి మొగలిపువ్వు గురైవుతుంది. ఇక నిజాయితీగా తెలుసుకోలేక పోయానని ఒప్పుకున్న విష్ణుమూర్తి, పరమశివునితో సమనంగా పూజింపతగిన వాడై విరాజిల్లుతాడు. కాని, బ్రహ్మ దేవునికి మాత్రం భూలోకమందు పూజిపతగని వాడిగా శాపమొందుతాడు. అంతట ఆ అగ్ని స్థంబము  మెల్లగా కంటికి చూడదగిన లింగాకారంలోనికి వస్తుంది. ఆ స్థంబము, అగ్ని జ్వాలాగా  ఏర్పడిన ప్రదేశమే అరుచాలప్రదేశ్. అందుకే అక్కడి పరమశివుడి లింగాన్ని అగ్నిలింగమని   పిలుస్తారు. ఇలా లింగ రూపంలోకి వచ్చిన మొదలు పూజలు మొదలుపెట్టిన రోజుని మహాశివరాత్రిగా పిలుస్తారు. లింగోద్భవం రాత్రి సమయంలో జరిగినందున శివరాత్రి అంటారు.

 

 

 

 

 

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: