శ్రీరామ నవమి నాడు సాధారణంగా హిందువులు సీత రాముల కల్యాణాన్ని అంగ రంగ వైభవంగా చేస్తారు. ఆ రోజు ఆ విగ్రహాలని వీధుల్లో ఊరేగిస్తారు. దీనినే నవరాత్రి లేదా వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. తొమ్మిది రోజుల పాటు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుతారు. అయితే ఇలా ఆ రోజు అనగా శ్రీరామ నవమి నాడు సీతా రాముల విగ్రహాలకు కళ్యాణం చేయడం ముఖ్యం. ఆ పద్ధతే ప్రాచీనుల నుండి కూడా అనుసరిస్తూనే ఉన్నాం .

 

 

అయితే పూజ లో భాగంగా మనం నైవేద్యం పెడతాము. ఆ నైవేద్యం లో బాగా ముఖ్యం అయినవి పానకం, వడ పప్పు. బెల్లం లో మిరియాలు కలిపి దానిలో నీరు పోసి ఈ పానకం ని తయారు చేస్తారు. అలానే వడపప్పు ని కూడా మనం తయారు చేసి నైవేద్యం పెట్టాలి. అయితే వడపప్పు ఎలా చెయ్యాలి అంటే ఈ రెసిపీని చూడండి .

 

 

ముందుగా పెసరపప్పుని నీళ్ళల్లో నానపెట్టాలి. దీనిని గంట లేదా రెండు గంటల ముందే నాన పెట్టుకోవాలి . ఆ తర్వాత దానిలో ఉన్న నీళ్ళని పక్కకి తీసేసి ఆ పెసర పప్పుని తీసుకోవాలి.ఇలా చేసుకోవచ్చు. లేదా మరో విధానం ఏమిటి అంటే నాన పెట్టి నీళ్లు తీసేసి పెసరపప్పుని పక్కన ఉంచి దానిలో పచ్చి మిర్చి ముక్కలు, సాల్ట్, కొబ్బరి తురుము, నిమ్మరసం దానిలో కలపాలి. ఇలా ఈ వడపప్పుని, పానకాన్ని కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు .

 

 

అలానే వీటితో పాటుగా  కొబ్బరి కాయ, పులిహోర , పొంగలి వగైరా కూడా మనం శ్రీ రామ నవమి పూజ లో  నైవేద్యం పెట్టవచ్చు. కాబట్టి స్వామి వారికి వీటితో నైవేద్యం పెట్టేసి పూజని పూర్తి చేసేయండి . 

మరింత సమాచారం తెలుసుకోండి: