లోకకళ్యాణం కోసం పాటుపడిన ఎంతోమంది స్వామీజీల లో మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు, రామానుజమ్, జీయర్ వంటి స్వాములు ఉన్న విషయం తెలిసిందే. ఈ స్వామీజీలు అందరూ చేతులలో కర్రలు పట్టుకొని ఉండడం మనం గమనించే ఉంటాం ..కానీ ఎందుకు పట్టుకున్నారు అనే విషయం మాత్రం ఆలోచించి ఉండము.. ఏ సమయంలో చూసినా వీళ్లు చేతుల్లో కచ్చితంగా కర్రలు ఉంటాయి.. మనలో చాలా మంది..వీరు సపోర్ట్ కోసం పట్టుకుని ఉంటారు అని అనుకుంటూ ఉంటారు.


ఈ కర్రలనే దండాలు అని కూడా అంటారు.. ఇక ఈ దండాలు ద్వైత, అద్వైత, వైరాగ్య, తాత్వికతకు గుర్తు. ఈ దండాలు వివిధ ఆకృతులలో ఉంటాయి.. దానికి గాలి, నీరు, అగ్ని, భూమి ,ఆకాశం ఇలా పంచభూతాలు కలిస్తేనే ,మనిషి కాబట్టి సన్యాసులు ఒక ఐదు అడుగుల కర్రను చేత పట్టుకుని తిరుగుతూ ఉంటారు అని చెబుతారు.. ఇక ఈ దండాలలో కూడా మూడు రకాలు ఉన్నాయట.. అవి ఏకదండి , ద్విదండి ,త్రిదండి..

ఏకదండి అనగా.. ఎవరైతే స్వామీజీలు ఒక కర్రను పట్టుకుని తిరుగుతూ ఉంటారో , వారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు అట.. ఉదాహరణకు ఆదిశంకరాచార్యులు అని చెప్పవచ్చు.. అద్వైత సిద్ధాంతం అంటే దేవుడు జీవుడు ఇద్దరు ఒకటేనని నమ్మే సిద్ధాంతం.. ఇక పూర్తిగా చెప్పాలి అంటే.. మన అంతరాత్మకు వ్యతిరేకంగా అక్రమాలు చేసినా, అన్యాయ మార్గాన వెళ్లినా,ఎలా ప్రవర్తించినా సరే ఆ పాప ఫలితాన్ని మనం బతికుండగానే ఏదో ఒక రూపంలో అనుభవిస్తాము అని  బోధిస్తూ వుంటారు. ఇక జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి తీసుకున్న కర్రను వీరు చేతిలో ధరిస్తారు.


ద్విదండి అనగా.. రెండు కర్రలను కలిపి ఒకటిగా కట్టి బోధనలు చేస్తూ ఉంటారు.. వీరు ద్వైత సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు.. ఉదాహరణకు  మద్వాచార్యులు. వీరు బోధించే తత్వం ఏమిటంటే.. దేవుడు వేరు.. జీవుడు వేరు.. పరమాత్మ వేరు..జీవాత్మ వేరు అనేది వీరి ఉద్దేశం..జీయర్ లు అందరూ ద్వైత సిద్ధాంతం కిందికి వస్తారు.

త్రిదండి అనగా.. మూడు కర్రలను ఒకే చోట కలిపి కట్టగా కట్టి భుజాన పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇలా చేసే వారిని తత్వత్రయం అని కూడా అంటారు. వీరు విశిష్టాద్వైతాన్ని బోధిస్తారు.. ఉదాహరణకు రామానుజాచార్యులు.. వీరు జీవాత్మ, ప్రకృతి , పరమాత్మ అన్ని నారాయణ తత్వం గా నమ్ముతూ.. జీవుడు అజ్ఞానంతో సంసారబంధంలో చిక్కుకున్నారని, నారాయణుడిని శరణు వేడినా.. వారు భగవాన్ అనుగ్రహం పొందుతారని, వీరు నమ్ముతారు ..అంతేకాదు వీరి సిద్ధాంతం ఏమిటంటే.. మనిషికి మరో జన్మ ఉండదు అని చెబుతారు.



మరింత సమాచారం తెలుసుకోండి: