ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో అన్ని  క్రికెట్ మ్యాచ్ లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్ళందరూ సోషల్ మీడియా వేదికగా అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ... అభిమానులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిసిసిఐ సెలెక్టర్స్  పై తీవ్ర విమర్శలు చేశారు ఇర్ఫాన్ పఠాన్ . తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్ చాట్ లో మాట్లాడిన మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. బీసీసీఐ  అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేసారు . భారతదేశంలో బిసిసిఐ సెలెక్టర్లు అందరూ 30 ఏళ్లకే ఆటగాళ్లను వృద్ధులుగా  చేసేస్తారని... ఇది  ఎప్పుడు నుంచొ  వస్తుంది అంటూ ధ్వజమెత్తాడు ఇర్ఫాన్ పఠాన్.. 

 


 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో అయితే కొంత మంది ఆటగాళ్లు 30 ఏళ్లకు తమ కెరీర్ను ప్రారంభిస్తే భారతదేశంలో మాత్రం 30 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ ప్రకటించాలని బీసీసీఐ  సెలెక్టర్లు  వ్యవహరిస్తారు అంటూ ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించారు. అందుకే భారతదేశంలో ముప్పై ఏళ్లు రాగానే ఆటగాళ్లలో ఇంట్లో కూర్చోవాల్సిన  పరిస్థితి తెలిపాడు. 30 ఏళ్ల వయసులోనే ఆటగాన్ని  బుద్ధుని చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనకు అంత జాతీయ జట్టులో పునాది పడి సందర్భం  గురించి గుర్తుచేసుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. 2003 లో తాను పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు అండర్ 19 భారత జట్టులో తాను కూడా ఒక సభ్యుడిని కావడం తన కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడింది అంటూ చెప్పుకొచ్చాడు.

 


 అయితే ముందుగా ఆ  పర్యటనకు వెళ్లడం తనకు అస్సలు ఇష్టం లేదని... కానీ వెళ్లేటప్పుడు ఎంతో అసంతృప్తితో వెళ్లి వచ్చుటప్పుడు  మాత్రం సంతృప్తి గా తిరిగి వచ్చాను అంటూ తెలిపాడు . లాహోర్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల సాధించడంతో తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది అంటు  గుర్తుచేసుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. అయితే భారత జట్టులోకి 19 ఏళ్ల వయస్సులోనే అరంగేట్రం  చేసిన పఠాన్  చాలా కాలం పాటు జట్టులో ఆల్ రౌండర్ గా సేవలందించాడు. ఇదే సమయంలో బ్యాటింగ్ మీద  ఫోకస్ చేయడంతో బౌలింగ్ కాస్త గాడి తప్పింది.. దీంతోపాటు బాటిల్లో రాణించలేక ఇటు బౌలింగ్లో రాణించలేక అర్ధాంతరంగా పఠాన్  కెరీర్ ముగిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: