అయితే నిన్న జరిగిన మూడో వన్డే మ్యాచ్లో చాహల్ ను దురదృష్టం వెంటాడింది... అరుదైన రికార్డును సొంతం చేసుకుందామని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన చాహల్ ఆశలు నిన్నటి మ్యాచ్ లో ఆవిరైపోయాయి. ఇంకా ఒక్క వికెట్ సాధిస్తే చాలు టి-20లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా రికార్డుసృష్టిస్తాడు భారత ఆటగాడు చాహల్. ఈ క్రమంలోనే నిన్న జరిగిన మూడో టీ-20లో ఒక వికెట్ పడగొట్టిన రికార్డును సాధించాలి అని ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూశాడు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన మ్యాచ్లో 13 ఓవర్లో చాహల్ బౌలింగ్లో మాక్స్వెల్ అవుట్ అయిపోయాడు.
దీంతో చాహల్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలో అదృష్టం కలిసిరాక చాహల్ వేసిన బాల్ కాస్త నో బాల్ గా మారిపోయింది... దీంతో బాడ్ లక్ అతని వెంట పడడంతో వికెట్ అయినప్పటికీ నోబాల్ కారణంగా వికెట్ ఇవ్వలేదు ఎంపైర్లు. కాగా ప్రస్తుతం టీ20 లో 59 వికెట్లు తీసిన చాహల్ బుమ్రా తో సరిసమానంగా ఉన్నాడు... ఇలా నిన్న జరిగిన 3వ టి20 మ్యాచ్ లో ఒక వికెట్ తీసి భారత్ తరపున టీ20 లో అత్యధిక వికెట్లు తీసిన బ్యాట్మెన్గా రికార్డు సృష్టించాలని అనుకున్నప్పటికీ చాహల్ కి అది మాత్రం కుదరలేదు. దీంతో చాహల్ అభిమానులు నిరాశ చెందారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి