ప్రస్తుతం ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా  వార్నర్ పాత్ర ఎంత  కీలకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. జట్టును ఎప్పుడూ తనదైన వ్యూహాలతో ముందుకు తీసుకెళ్లి అద్భుతమైన పోరాటం చేసి జట్టుకు విజయం అందించడంలో డేవిడ్ వార్నర్ కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు ఎలాంటి స్టార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా దూసుకుపోతూ ఉంటుంది.   సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాటపటిమ కి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అవుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఇలా జట్టును తనదైన శైలిలో ఎంతో సమన్వయంగా ముందుకు తీసుకెళుతున్న డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం టోర్నీకి దూరం అయ్యే అవకాశం ఉంది అని ప్రచారం మొదలైంది.



 గత ఏడాది టీమిండియా తో జరిగిన మ్యాచ్ లో గజ్జల గాయం బారినపడిన డేవిడ్ వార్నర్ ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడాడు.  అయితే గాయం తీవ్రం కావడంతో 9 నెలలు రెస్ట్ అవసరం అని వైద్యులు చెప్పారు అంటూ ఓ ఇంటర్వ్యూలో డేవిడ్ వార్నర్ తెలిపినట్లు  ఒక వార్త వైరల్ గా మారింది. ఈ లెక్కన చూస్తే ఐపీఎల్ కి డేవిడ్ వార్నర్ అందుబాటులో ఉండే అవకాశం లేదు అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టడం తో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అందరూ ఆందోళనలో మునిగిపోయారు. అయితే ఇక డేవిడ్ వార్నర్ ఐపీఎల్ కు దూరం కాబోతున్నాడు అని వస్తున్న వార్తల పై ఇటీవల స్పందించిన డేవిడ్ వార్నర్ క్లారిటీ ఇచ్చాడు.



 గాయం తాలూకు బాధ తొమ్మిది నెలల వరకు ఉంటుంది అన్న విషయం తానే చెప్పానని.. అయితే  మార్చి నుండి జరగబోయే ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో తాను ఆడబోతున్నాను అంటూ డేవిడ్ వార్నర్ క్లారిటీ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఇక ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో కూడా ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్ల నిషేధం తర్వాత డేవిడ్ వార్నర్ గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో అడుగుపెట్టాడు అన్న విషయం తెలిసిందే . అయితే ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆడబోతున్నాడు అన్న దానిపై క్లారిటీ రావడంతో ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ఇక ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో సన్రైజర్స్ జట్టు టైటిల్ గెలుస్తుందనే ధీమాతో ఉన్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: