కొలంబో వేదికగా నిన్న శ్రీలంక మరియు టీమిండియా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో... వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరు మీద ఉన్న టీమిండియాకు బ్రేకులు పడ్డాయి. చివరి మ్యాచ్లో శ్రీలంక జట్టు సమయ స్ఫూర్తితో ఆడి... విజయ బావుటాను ఎగుర వేసింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే... టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శేఖర్ దావన్ మొదట బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపాడు.

దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పూర్తిగా విఫలమైంది. మొదట్లో బాగా ఆడినప్పటికీ మిడిలార్డర్ విఫలం కావడంతో కేవలం 225 పరుగులకే చాప చుట్టేసింది. వర్షం కారణంగా 47 ఓవర్లకే ఎంపైర్లు మ్యాచ్ ను కుదించారు. ఇంకా ఇండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే... ఓపెనర్ పృథ్వీషా 49 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులు, అలాగే సంజు శాంసన్ 46 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.మరోవైపు కెప్టెన్ శిఖర్ ధావన్ తో సహా మిగతా బ్యాట్స్ మెన్స్ పూర్తిగా విఫలమయ్యారు. ఇక చేదైన కు దిగిన శ్రీ లంక టీం మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఆడింది. 

కేవలం 39 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది శ్రీలంక జట్టు. శ్రీలంక జట్టు లో ఓపెనర్ ఆవిష్క... డెబ్బై ఆరు పరుగులు మరియు మినోద్ 65 పరుగులు చేసి... జట్టును విజయ తీరాలకు చేర్చారు. చివరి మ్యాచ్ ఓడిన అప్పటికీ....2-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఇండియా బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. కాగా శ్రీలంక మరియు టీమిండియా మధ్య ఆదివారం రోజున మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ మొదలు కానుంది. ఇక ఇందులో టీం ఇండియా ఎలా రాణిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: