ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయపెడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం గమనార్హం. అయితే ఇక ఈ కొత్త వైరస్ ఎంతో ప్రమాదకారి అంటూ అటు వైద్యనిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇంతకుముందు  వ్యాప్తి చెందిన వైరస్ లతో పోల్చి చూస్తే ఈ కొత్త వేరియంట్  లక్షణాలు కూడా భిన్నంగా ఉన్నాయి అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఈ కొత్తరకం వేరియంట్ వణికిస్తోంది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఎలాంటి కేసులు వెలుగులోకి రాక ముందే అన్ని దేశాలు కూడా అప్రమత్తం అయిపోతున్నాయి.


 ఇక అటు ఓమిక్రాన్ పేరు చెబితే చాలు భారత్ కూడా వణికి పోతోంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒక దేశంగా ఉంది.  దీంతో ఇక ఓమిక్రాన్ వైరస్ కేసులు వెలుగులోకి రాక ముందే కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే అటు క్రికెట్ ప్రేక్షకులకు కూడా ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతు ఉండడంతో ఇటీవల ఎన్నో రోజుల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ప్రేక్షకులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్టేడియంలో పూర్తి స్థాయి ప్రేక్షకులను అనుమతించారు.


 కానీ ప్రస్తుతం ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలకు అనుగుణంగా క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ నిర్వహించబోతోంది అని తెలుస్తోంది. దీంతో న్యూజిలాండ్ లో జరగబోయే రెండవ టెస్ట్ కి లిమిటెడ్ గానే ప్రేక్షకులను అనుమతిస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇక్కడి స్టేడియంలో 33 వేల మంది ప్రేక్షకులు అనుమతించే సామర్ధ్యం ఉంది. కానీ 25 శాతం మందికి మాత్రమే అనుమతించ పోతున్నట్లు తెలిపింది. ఇక డిసెంబర్ 3వ తేదీ నుంచి రెండో టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: