మొన్నటివరకు విరాట్ కోహ్లీనీ వన్డే కెప్టెన్సీ నుంచి బిసిసిఐ తపిస్తూ రోహిత్ శర్మ ను కొత్త కెప్టెన్గా నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకోవడంపై భారత క్రికెట్ లో  తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.. మరికొన్ని రోజులపాటు టెస్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ కొనసాగుతాడు అని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు  నిర్ణయం తీసుకోవడం ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


 అయితే టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించిన నిర్ణయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు.. ఇక జట్టులో ఉన్న ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమిండియా సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా స్పందిస్తూ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేస్తూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం అతని వ్యక్తిగతం అంటూ వ్యాఖ్యానించాడు. అతడి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది అంటూ జస్ప్రిత్ బూమ్రా తెలిపాడు. మా గ్యాంగ్ లీడర్ గా ఎప్పటికీ అతడే కొనసాగుతాడని బూమ్రా చెప్పుకొచ్చాడు.


 మేమంతా చాలా క్లోజ్గా ఉంటాం. అందుకే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం నాకు ముందే తెలుసు. అతని నిర్ణయాన్ని మేమందరం గౌరవిస్తాం.. కెప్టెన్సీ నుంచి  తప్పుకోవడం అది అతని వ్యక్తిగత నిర్ణయం.. ఒక కెప్టెన్గా జట్టు కోసం ఎంతగానో శ్రమించాడు విరాట్ కోహ్లీ. అతని నాయకత్వానికి జట్టు మొత్తం విలువ ఇస్తుంది. అతడి నిర్ణయాన్ని జడ్జ్ చేయడం ఏమాత్రం సరికాదు. అతని మానసిక స్థితి ఎలా ఉంది శరీరం ఎలా స్పందిస్తుంది అన్న విషయం ఎవరికీ తెలియదు. ఇక కోహ్లీ సారథ్యంలోని టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తనకు ఉన్నతమైన బౌలర్గా  ఎదిగేందుకు ఎంతగానో సహకారం అందించాడు కోహ్లీ. జట్టులో విప్లవాత్మకమైన మార్పులకు కారణం అయ్యాడు అంటూ జస్ప్రిత్ బూమ్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: