ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల టెస్టు సిరీస్ ఆడింది టీమిండియా. కోహ్లీ కెప్టెన్సీలో టెస్టు సిరీస్లో విజయం సాధించి సరికొత్త చరిత్ర సాధించాలి అని అనుకుంది టీమిండియా. కానీ ఊహించని విధంగా టీమిండియా టెస్టు సిరీస్లో ఓటమిపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ముగియడంతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. ఇక వన్డే సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.



 అయితే కె.ఎల్.రాహుల్ మొదటి సారి విదేశీ పర్యటనకు వెళ్లిన టీం ఇండియాకు సారధ్యం వహిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే కెప్టెన్గా కె.ఎల్.రాహుల్ ఎలా రాణిస్తాడు అని అనుకుంటున్న సమయంలో ఇటీవల కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీకి కలిసి వచ్చే ఒక వార్త అందింది.. సౌత్ ఆఫ్రికా జట్టులో ఎంతో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్న రబడా వన్డేసిరీస్ ఆడటం లేదు అంటూ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుకు తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా  క్రికెట్ ఆడుతున్నాడని అందుకే కొన్ని రోజుల పాటు అతనికి విరామం ఇవ్వాలని ఉద్దేశంతోనే పక్కన పెట్టాము అంటూ క్రికెట్ బోర్డు తెలిపింది.



 ఇక వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్లో రబడా అందుబాటులో ఉంటాడు అంటూ తెలిపింది.ఏది ఏమైనప్పటికీ  రబాడా సౌత్ ఆఫ్రికా జట్టులో లేకపోవడం మాత్రం కేఎల్ రాహుల్ కు ఎంతగానో కలిసి వచ్చే అవకాశం ఉంది.  టీమిండియా ఆడిన టెస్టు సిరీస్లో రబడా కీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ కు రబడా లాంటి  బౌలర్ తో సవాళ్లు ఎదురవుతాయ్.  ఇలాంటి నేపథ్యంలో రబడా సౌత్ ఆఫ్రికా జట్టులో లేక పోవడం.. కెప్టెన్ రాహుల్ కి ఎంతగానో కలిసి వచ్చే అంశం అన్నది అర్థమౌతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: