ఇటీవలే అండర్-19 ప్రపంచకప్ ప్రారంభ మైంది అన్న విషయం తెలిసిందే.ఇక ఈ ప్రపంచ కప్ లో భాగంగా భారత కుర్రాళ్లు జైత్రయాత్ర కొనసాగుతోంది. మొదటి మ్యాచ్ లోని అద్భుతమైన విజయాన్ని సాధించినా అండర్-19 జట్టు ఇక ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతుంది. భారత అండర్-19 జట్టు ఆటగాళ్లు అందరూ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు అని చెప్పాలి. బ్యాటింగ్ బౌలింగ్ అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా మొదటి మ్యాచ్  సౌత్ఆఫ్రికా జట్టుతో తలబడ్డారు  భారత ఆటగాళ్లు.


 ఈ క్రమంలోనే భారీ పరుగుల తేడాతో సౌత్ఆఫ్రికా జట్టుపై విజయం సాధించారు. అయితే అటు సౌతాఫ్రికా టూర్ లో ఉన్న భారత జట్టు ఓటమి పాలు అయినప్పటికీ అండర్ 19 టీమిండియా జట్టు మాత్రం సౌత్ఆఫ్రికాపై విజయం సాధించడంతో అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోయారు. అయితే ఇక మొదటి మ్యాచ్ లో విజయం సాధించడమే కాదు ఆ తర్వాత మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు. ఆ తర్వాత ఐర్లాండ్ జరిగిన మ్యాచ్ లో కూడా ఘన విజయం సాధించిన అండర్-19 భారత జట్టు ఇక ఇటీవలే ఉగాండా తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇరగదీసింది.


 ఏకంగా 326 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది భారత అండర్-19 జట్టు. ఇక మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 405 పరుగులు చేసింది. ఆ తర్వాత 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా జట్టు కేవలం 79 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 326 పరుగుల తేడాతో విజయం సాధించింది అండర్-19 జట్టు. అయితే ఇక భారత జట్టు విజయం సాధించడంలో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రాజ్ భవ కీలకపాత్ర వహించాడు. 162 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక మరో ఓపెనర్ రఘు వంశీ 144 పరుగులతో రాణించాడు. అదే అండర్ 19 ప్రపంచ కప్ లో అత్యధిక స్కోరు చేసిన తొలి భారత ఆటగాడిగా రాజ్ భవ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 155 పరుగులతో శిఖర్ ధావన్ అండర్ 19 ప్రపంచ కప్ లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగా ఉండేవాడు. ఇటీవల 162 పరుగులు చేసిన రాజ్ భవ ఈ రికార్డును తిరగరాశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: