టీమ్ ఇండియాకి ప్రస్తుతం విజయాల వేటలో ఉంది. ఒక్క సీరీస్ పరాజయం ఇండియా క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నిస్తోంది. ఇంత కాలం మనకు ఎవరూ సాటి రారు అని భుజాలు ఎగరేసుకు చెప్పుకునేవారము. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉంది. టీమ్ లో ఉన్న ఆటగాళ్ళు అంతా నైపుణ్యం కలిగిన వారే... అయినా ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయంపై ఇప్పటికే చాలా చర్చలు జరిగి ఉన్నాయి. కొత్తగా వచ్చిన కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ప్రస్తుతం ఎక్కువగా ఒత్తిడి ఉంది. కానీ టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ఒకటిగా చేసి వారి నుండి విజయానికి అవసరం అయ్యే ఆటను రాబట్టుకోవడం అసలైన ఛాలెంజ్.

కానీ ఇది ఎవరి చేతిలో ఉంటుంది అంటే 100 శాతం కెప్టెన్ పైనే అని చెప్పాలి. మొన్నటి వరకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ ల నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కెప్టెన్ రేస్ లో రోహిత్, రాహుల్ ఉన్నారు. కానీ రాహుల్ సౌత్ ఆఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలం అయ్యాడు. ఇక రోహిత్ కెప్టెన్ గా సమర్ధుడే అయినప్పటికీ... తరచూ గాయాల బారిన పడడం ఒక వ్యతిరేకతగా చెప్పుకోవాలి. ఇటువంటి పలు కీలక పరిస్థితుల దృష్ట్యా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా ఉండాలని పలువురు మాజీలు మరియు బీసీసీఐ అడుగుతున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 6 నుండి వెస్ట్ ఇండీస్ తో మూడు వన్ డే లు మరియు మూడు టీ 20 లు జరగనున్నాయి. ఇప్పటికే వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి టీ 20 సీరీస్ ను చేజిక్కించుకుంది. సో ఈ సీరీస్ ను వెస్ట్ ఇండీస్ ఎంతో ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టనుంది. కాబట్టి ఈ సీరీస్ కు కోహ్లీ కెప్టెన్ గా వస్తాడా? లేదా ఇవి అంతా రూమర్ లేనా అన్నది తెలియాలంటే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. మరి చూద్దాం ఏమి జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: