మరి ఆ ఆటగాడు ఎవరో చూద్దామా ? వెస్ట్ ఇండీస్ టీమ్ లో మూడు ఫార్మాట్ లలోనూ కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్. ఇప్పుడు గత కొన్ని మ్యాచ్ లుగా తనకున్న అన్ని ప్రతికూలతలను అధిగమించి ఒక మంచి ప్లేయర్ గా మారాడు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే నిన్నటితో ఇంగ్లాండ్ తో ముగిసిన టీ 20 సీరీస్ లో తన యొక్క ఆల్ రౌండ్ ప్రతిభతో వెస్ట్ ఇండీస్ జట్టుకు సీరీస్ ను అందించి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ తో జరిగిన 5 టీ 20 లలో మొత్తం 15 వికెట్లు తీసి సీరీస్ విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు.
ఈ వికెట్లలో ఒకసారి 5 వికెట్లు సాధించాడు. మరియు కీలకం అయిన సీరీస్ డిసైడర్ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో 20 పరుగులు అవసరం అయిన దశలో బౌలింగ్ తీసుకున్న హోల్డర్ మంచి బౌలింగ్ తో వరుసగా నాలుగు వికెట్లు సాధించిన రికార్డ్ విజయాన్ని అందించాడు. కాబట్టి ఈ ఐపిఎల్ వేలంలో హోల్డర్ మంచి ధరను పొందుతాడు అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఐపిఎల్ ఫ్రాంచైజీలు కూడా ఇతనిని కొనుగోలు చేయడానికి ఇంటరెస్ట్ గా ఉన్నట్లు క్రికెట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి