కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మరియు స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ గుండె పోటుతో మరణించిన విషయం విదితమే. ఈయన మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు ఎంతగానో ఆవేదన చెందారు. కాగా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినందుకు చాలా అవేదనకు గురవుతున్నాను అంటూ బాధపడ్డారు వార్న్ మాజీ  ప్రేయసి నటి ఎలిజబెత్‌.  షేన్‌ వార్న్‌ ఈ నెల 4న గుండె పోటుతో మరణించగా మార్చి 20న ఆయన భౌతిక కాయానికి ఆస్ట్రేలియాలో అంత్యక్రియలు నిర్వహించారు వారి కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మద్యన అంత్యక్రియలు జరిగాయి. అయితే వార్న్ మాజీ ప్రేయసి అయిన ఎలిజిబెత్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. దాంతో భావోద్వేగానికి గురైన ఆమె ఈ విధంగా తన బాధని పంచుకున్నారు.

నా గుండె తరుక్కుపోతుంది, నొప్పి భరించలేకుండా ఉన్నాను. షేన్‌ అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడంతో నా బాధ రెట్టింపు అయ్యి విలవిల్లాడుతున్నాను అంటూ  వ్యక్తం చేశారు . గత రాత్రి షూట్‌ కారణంగా నేను షేన్ అంత్యక్రియలకు వెళ్లలేకపోతున్నా చివరి చూపుకు చూసే భాగ్యం నాకు దక్కలేదు అంటూ వారు కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఎలిజబెత్. ఈ ఫోటోలు మా ఎంగేజ్మెంట్ జరిగిన సందర్భంవి ఆ సమయంలో మా పిల్లలు కూడా మాతో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు ఎలిజిబెత్.  

భార్య సిమోనే కాలన్‌ కి తనకి మద్య మనస్పర్ధలు రావడంతో 2005 లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ముగ్గురు సంతానం. ఆ తర్వాత కొన్నాళ్ళు నటి ఎలిజిబెత్ తో రిలేషన్ లో ఉండగా 2011 లో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ రెండేళ్లకే వీరి బంధం ముక్కలయ్యింది. 2013 లో వీరు విడిపోయారు. కానీ మంచి స్నేహితులుగా తమ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని అప్పట్లో చెప్పుకొచ్చారు ఈ జంట.  

మరింత సమాచారం తెలుసుకోండి: