పాకిస్థాన్ కెప్టెన్ గా బాబర్ ఆజామ్ ఎంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ క్రికెటర్ లలో ఒకటిగా ఉన్నాడు బాబర్ ఆజామ్. ఒకవైపు జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించటమే కాదు మరో వైపు ఒక ఆటగాడిగా కూడా అద్భుతమైన విజయం సాధిస్తూ ఉన్నాడు బాబర్ అజాం. కాగా ఇటీవలే ఆస్ట్రీలియా తో జరిగిన టెస్ట్ ఇన్నింగ్స్  లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చేసిన ప్రదర్శన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఏకంగా 196 పరుగుల  ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజామ్ అద్భుతమే సృష్టించాడు. దాదాపు 600 మూడు నిమిషాల పాటు క్రీజులో గడిపిన బాబర్ ఆజామ్ ఎంతో ఓపికగా ఆడి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. పాకిస్తాన్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరిగి దాదాపు వారం కావస్తుంది. కానీ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి మాత్రం ఇప్పటికీ ఎవరూ మరచి పోవడం లేదు అని అని చెప్పాలి. ఎందుకంటే తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్లో అనే సరికొత్త రికార్డులను బద్దలు కొట్టాడు బాబర్ ఆజామ్.


 మొదటి మ్యాచ్లో నాలుగవ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో బాబర్ ఆజామ్ ప్రస్తుతం ఏడవ స్థానంలో నిలిచాడు. అంతేకాదు పాకిస్తాన్ జట్టు తరఫున టెస్ట్ మ్యాచ్లో నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్ గా బాబర్ ఆజామ్  రికార్డు సృష్టించడం గమనార్హం. అంతకుముందు యూనిస్ ఖాన్ 2015లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు బాబర్ ఆజామ్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సాధించిన రికార్డు గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అయితే చెత్త పిచ్లపై ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసిన బాబర్ అజామ్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. రికార్డుల కోసమే బాబర్ అజామ్ ఆస్ట్రేలియాతో టెస్ట్ ఆడినట్టు ఉన్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: