ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎంతో రసవత్తరంగా జరిగిన  మ్యాచ్లో చివరికి రాజస్థాన్ రాయల్స్ 15 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 222 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత చేదనకు  దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్ష్యాన్ని సాధించలేకపోయింది. 15 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో రెండు జట్లు భారీ స్కోరు చేయడం అభిమానులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించింది అని చెప్పాలి.


 అయితే ఇక ఇలా మ్యాచ్ ఎంతో ఉత్కంఠ   భరితంగా కొనసాగుతున్న సమయంలో అంపైర్ నిర్ణయం కాస్త వివాదాస్పదంగా మారిపోయింది. నడుము కంటే ఎత్తుకు బంతి వెళ్లినప్పటికీ కూడా ఆ బంతిని ఎంపైర్ నో బాల్ గా ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ  కెప్టెన్ రిషబ్ పంత్ సహా కోచింగ్ సిబ్బంది చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గల్లీ క్రికెట్ ను తలపించింది ఐపీఎల్ మైదానం. ఏకంగా క్రీజులో ఉన్న బ్యాట్మెన్స్ అందరిని కూడా వెనక్కి పిలవడం చేశాడు రిషబ్ పంత్. ఇక ఆ సమయంలో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎవరూ చూడని ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది.


 కుల్దీప్ యాదవ్ చాహల్ మధ్య చిన్నపాటి సరదా గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది క్రికెట్ లవర్స్ అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది అని చెప్పాలి. చివరి ఓవర్లో 36 పరుగులు అవసరం కాగా రోవ్మన్ పావెల్ తొలి మూడు బంతులను సిక్సర్లు గా మలిచాడు. మూడో బంతి నడుము కంటే ఎక్కువ పైన కి వచ్చింది. కానీ నో బాల్ గా ప్రకటించలేదు .  దీంతో ఇక్కడే  వివాదం మొదలైంది.  రిషబ్ పంత్ ఆటగాళ్లను డగౌట్ లోకి వచ్చేయాలి అంటూ సూచిస్తూ ఉండగా అది  చాహల్ మాత్రం కుల్దీప్ యాదవ్ తో పోట్లాడాడు. ఏకంగా తల పట్టుకుని ముందుకు నెట్టడం లాంటివి కూడా చేస్తాడు. ఇది చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl