ఐపీఎల్ లో నేడు బెంగుళూరు మరియు పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. ఇంకా ప్లే ఆప్స్ లో మూడు స్థానాలు ఖాళీగా ఉండడంతో ఏదొక స్థానాన్ని దక్కించుకోవాలని ఇరు జట్లు వేచి చూస్తున్నాయి. అందులో భాగంగా మొదట టాస్ గెలిచిన బెంగుళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ సీజన్ లో సరిగా ఆడని ఇంగ్లాండ్ కీపర్ బ్యాట్సమాన్ జానీ బైర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 29 బంతులను ఆడి 66 పరుగులు చేసి పంజాబ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇందులో 7 సిక్సర్లు మరియు 4 ఫోరులు ఉన్నాయి.

అయితే బైర్ స్టో అవుట్ అయ్యాక పరుగులు నెమ్మదించినా మరో ఇంగ్లాండ్ ఆటగాడు లియాం లివింగ్స్టన్ మాత్రం నెమ్మదిగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇతను 42 బంతుల్లో 70 పరుగులు చేసి పంజాబ్ 209 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ప్లే ఆప్స్ రేస్ లో నిలవాలంటే ఈ స్కోర్ ను కాపాడుకోవాలి మరియు వీలైనంత ఎక్కువ మార్జిన్ తో గెలవాల్సి ఉంది. ఇక ఈ స్కోర్ ను బెంగుళూరు ఆటగాళ్లు ఛేదిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ జట్టులో అందరూ ఫామ్ లో ఉండడం బెంగుళూరు కు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా డుప్లిసిస్, కోహ్లీ, మాక్స్ వెల్, కార్తీక్ లు చెలరేగితే ఈ స్కోర్ ను చేధించడం అంత కష్టం కాదు.

అయితే పంజాబ్ బౌలింగ్ కూడా అంత ఈజీ గా తలొగ్గుతుందని భావించడం పొరపాటే అవుతుంది. వీరిలో రబడా, అర్ష్ డీప్ సింగ్, రాహుల్ చాహర్ లు కీలకమ్ కానున్నారు. మరి రిజల్ట్ ఏమవుతోందో చూడాలి. ఇంకాసేపట్లో మ్యాచ్ లో విన్నర్ ఎవరు అనేది తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: