ఏడాది కొత్త కెప్టెన్ డూప్లెసిస్ సారథ్యంలో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఎంతో పటిష్టంగా కనిపించింది అన్న విషయం తెలిసిందే. చివరికి లక్కు కూడా బాగా కలిసి వచ్చి ఇటీవలే ప్లే ఆఫ్ లో  అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలోనే అటు కెప్టెన్ గా డుప్లేసెస్ ఐపీఎల్ లో ఎంతో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. జట్టులో ఎక్కువగా మార్పులు చేయకుండా మంచి ఫలితాలు రాబట్టాడు అని ప్రస్తుతం మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. సంజయ్ బంగర్, బెంగుళూరు హెడ్ కోచ్గా రావడం ఒక కొత్త కెప్టెన్ చేరిక తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వ్యూహాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చింది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒక ఆటగాడు రెండు మూడు మ్యాచ్ లలో సరిగా ఆడక పోతే తుది జట్టు నుంచి తప్పించేవారు. కానీ అటు కోచ్ సంజయ్ బంగర్ కెప్టెన్సి ఆసాంతం ఒకరిద్దరిని మినహా అందరిని కొనసాగించారు. అనూజ్ రావత్ మినహా చెత్త ప్రదర్శన చేసినందుకు ఎవరిని కూడా పక్కన పెట్టలేదు. ఇక ఇలా నిలకడగా ముందుకు సాగడమే బెంగళూరు జట్టుకు కలిసొచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.


 గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో విరాట్ కోహ్లీ తోపాటు ఏబీ డివిలియర్స్  ఆడుతూ ఉంటే భయపడేవారు అంటూ తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్.. ఇక ఈ ఏడాది దినేష్ కార్తీక్,  గ్లెన్ మాక్స్ వెల్ కూడా అటు ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారిపోయాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా అదృష్టవశాత్తు ప్లేఆఫ్ లో అవకాశం దక్కించుకున్న బెంగళూరు జట్టు మొదటిసారి టైటిల్ గెలవాలన్న కసితో కనిపిస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో జట్టుతో తలపడనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl