బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్ కి ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకునేందుకు ఎన్నో సంస్థలు  తీవ్రంగా పోటీ పడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల పోటీని దక్కించుకునేందుకు ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్ ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.


 అమెజాన్ ఓటీటీ సంస్థ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో రిలయన్స్ కి చెందిన వయాకామ్ 18 మిగతా మూడు సంస్థలతో కలిసి ప్రస్తుతం పోటీలో కొనసాగుతుంది అని చెప్పాలి. అమెజాన్‌ సహా డిస్నీ స్టార్, వయాకామ్‌–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. కానీ ఇప్పుడు ఈ పోటీ నుంచి అమెజాన్  సంస్థ వైదొలగడంతో టీవీ డిజిటల్ హక్కుల పోటీ నాలుగు సంస్థల మధ్య ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే ఈసారి అపర కుబేరుడు జెఫ్ జోసెఫ్ పోటీలో ఉండడంతో ఈ సారి దాదాపు 75 వేల కోట్ల వరకూ బిడ్ రావచ్చు అని అందరూ అంచనా వేశారు.


 ప్రస్తుతం పోటీ నుంచి అమెజాన్ తప్పుకోవడంతో అందరి అంచనాలు కూడా తారుమారు అయ్యాయి అని చెప్పాలి. ఇకపోతే ఆదివారం మొదలయ్యే ఈ వేలం రెండు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది అని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉన్నతాధికారి చెప్పడం గమనార్హం. అమెజాన్ వైదొలగిన అప్పటికీ పోటీలో ఉన్న సంస్థలు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు అంచనాలు కూడా ఉన్నాయట. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ కి మరింత పాపులారిటీ రావడం.. అందరికీ చేరువ అవ్వటం కారణంగానే 32వేల కోట్ల బిడ్ ఖాయం అంటున్నారు నిపుణులు. తీవ్రమైన పోటీ ఉంటే  45 వేల కోట్ల రూపాయల  వరకు ఐపీఎల్ మీడియా  ప్రసార హక్కుల ద్వారా రావచ్చని అంచనా వేస్తూ  ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl