గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ తో ఎంత ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్గా భారీగా పరుగులు చేస్తూ ఎన్నో రికార్డులను కొల్లగొట్టినా విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మాత్రం పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కోహ్లీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతనికి కొన్నాళ్లపాటు విశ్రాంతి అవసరం అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి సమయంలోనే కోహ్లీ ఫాం పై స్పందించిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం కంటే దేశవాళీ క్రికెట్లో ఆడి మళ్లీ ఫామ్ లోకి రావడం ఎంతో ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ దేశవాళీ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఆడితే.. మళ్లీ ఫామ్లోకి రావడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్.  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్  ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తన ఫాంను అందుకోవాలంటే.. దేశవాళీ క్రికెట్ ఆడటం బెటర్.. అక్కడ పరుగులు సాధించాలి. డొమెస్టిక్ క్రికెట్ లో బౌలింగ్ ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు.  కానీ అది కోహ్లీ తన లయను అందుకోవడానికి ఉపయోగపడుతుంది. అతని మైండ్ భారీ స్కోరు చేయాలనే దిశగా సిద్ధమవుతోంది. ఒకసారి తన ఫామ్ తిరిగి పొందే అతని ఆపడం ఎవరి తరమూ కాదు.


 ఇలా కోహ్లీ ఫామ్ లోకి వస్తే ఇక ప్రత్యర్థి ఎవరైనా సరే పరుగుల వరద పారిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్. అదే సమయంలో కోహ్లీ బ్యాటింగ్ తో పాటు టెక్నిక్ లో కూడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ బ్యాటింగ్ చూస్తూ ఉంటే అతడు ఎక్కువగా ఆఫ్ స్టంప్ అవతల వెళుతున్న బంతులను వెంటాడుతూ చివరికి వికెట్ చేజార్చుకున్నాడు. కోహ్లీ అన్ని బంతులను ఎదుర్కుని బౌలర్లను డామినేట్ చేయాలనుకుంటున్నాడు. కానీ అది కొన్ని సార్లు అతనికి  ముప్పు తీసుకొచ్చి పెడుతుంది.  అదే సమయంలో కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో కూడా కనిపిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్.

మరింత సమాచారం తెలుసుకోండి: