ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్ చేయబడిన టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది టీమ్ ఇండియా. అయితే ప్రస్తుతం టీమిండియా లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యారు. కేఎల్ రాహుల్ గజ్జల్లో గాయం కారణంగా సర్జరీ కావడంతో చివరకు బెడ్ రెస్ట్ తీసుకుంటుండగా అటు రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడటంతో ఇక జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ వహిస్తూ ఉన్నాడు.


 ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక బ్యాటింగ్ లో ఎవరు ఎలా రాణిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇలాంటి సమయంలోనే భారత బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కుప్పకూలి పోయింది అని చెప్పాలి. దీంతో భారత ప్రదర్శన చూసి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఇక భారత్ ఎంతలా  విఫలం అయింది అంటే 98 పరుగులకే  కీలకమైన ఐదు వికెట్లను కోల్పోయింది భారత జట్టు. ఇందులో ఎవరూ కూడా మెరుగైన పరుగులు చేయలేకపోయారు అని చెప్పాలి.



 అలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను గట్టెక్కించారు.  కాసేపు నెమ్మదిగా ఆడిన రిషబ్ పంత్ క్రీజ్లో కుదురుకున్నా తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లపై వీరవిహారం చేసాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా ఒకవైపు రిషబ్ పంత్ కి సహకారం అందిస్తూనే మరోవైపు తాను కూడా పరుగులు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లు ఆడిన టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ రవీంద్ర జడేజా భాగస్వామ్యం ఒక రికార్డు నెలకొల్పింది. ఇద్దరు కలిసి 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఇదే టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై టీమ్ఇండియాకు అత్యధిక ఆరో వికెట్ భాగస్వామ్యం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: