ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించి తీరుతుందని భారత అభిమానులు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరికీ నిరాశ ఎదురైంది. విజయపు అంచుల వరకూ వెళ్లిన టీమిండియా చివరికి ఓటమి తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్ లో  మొదట్లో ఆధిపత్యం చెలాయించినటు గానే కనిపించిన టీమ్ ఇండియా అటు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల జోరును తట్టుకోలేకపోయింది. చివరికి ఓడిపోవడంతో సిరీస్ 2-2 తో సమం అయింది అన్న విషయం తెలిసిందే.
 అయితే ఈ పరాజయంపై అటు మాజీ క్రికెటర్లు అందరూ కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్లో ఓటమి కి పూర్తి బాధ్యత బ్యాట్స్ మెన్ లదే అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్ చోప్రా. బ్యాట్స్మెన్లు  పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్సులో పూజారాతప్ప,పంత్ తప్ప మిగతా బ్యాట్స్మెన్లు  ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. టెస్ట్ ఫార్మాట్ లో ఎక్కువమంది బ్యాట్స్మెన్లు  రాణించక పోతే ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం సాధించడం  చాలా కష్టం.


 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ పై భారత్ ఓటమికి ఇక పూర్తి బాధ్యత బ్యాట్స్ మెన్ లదే  అవుతుంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన పని తాను చేసుకుపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో అనవసరమైన షాట్కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ పరిస్థితులను బట్టి పంత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు అని అనుకుంటున్నాను అంటూ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా చెప్పుకొచ్చాడు ఆకాష్ చోప్రా.ఏది ఏమైనా అటు టీమ్ ఇండియా పరాజయం పాలుకావడం మాత్రం భారత్ అభిమానులందరినీ కూడా తీవ్ర నిరాశకు లోను చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: