ఇటీవలి కాలంలో హార్దిక్ పాండ్యా ఎంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన కారణంగా టీమిండియాలో అవకాశాలు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా ఇక టీమిండియాలో అసలుసిసలైన ఆల్ రౌండర్ అనే పదానికి తన ఆటతీరుతో సరికొత్త అర్థం చెబుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా మెరుపు బ్యాటింగ్ చేస్తూ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. బౌలింగ్ లో కూడా అదరగొడుతు ఒకవైపు పరుగులను కట్టడి చేయడమే కాదు మరోవైపు వికెట్లు కూడా పడగొడుతున్నాడు అని చెప్పాలి.


 హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మునుపటిలా రాణించడం కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పాలి. ఇక ప్రతీ మ్యాచ్లో కూడా హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన నేపథ్యంలో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోతున్నారు అని చెప్పాలి. అయితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తనకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువు లాంటి వాడు అని చెబుతూ ఉంటాడు. ధోనినీ చూస్తూనే క్రికెట్లో ఎదిగాను అని ఎప్పుడూ అంటూ ఉంటాడు. ఎప్పుడూ ధోని పట్ల గురుభక్తిని ప్రదర్శిస్తూ ఉంటాడు హార్దిక్ పాండ్యా.


 అలాంటి హార్దిక్ పాండ్యా తాను గురువుగా భావించే మహేంద్ర సింగ్ ధోనీనీ వెనక్కినెట్టి అరుదైన రికార్డును సాధించాడు. ఇటీవలే మొహాలీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్ లో 31బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఇక ఇందులో ఐదు సిక్సర్లు ఉండటం గమనార్హం. తద్వారా అంతర్జాతీయ టీ20 లో డెత్ ఓవర్లలో  అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా 39 సిక్సర్లు కొట్టాడు. రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 34 సిక్సర్లతో ఉన్నాడు.  ఇక ఈ లిస్ట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముప్పై రెండు సిక్సర్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: