భారత క్రికెట్ లో ఉన్న అందరూ క్రికెటర్లలో అటు  మహేంద్ర సింగ్ ధోనీకి  ప్రత్యేక స్థానం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక సాదాసీదా క్రికెటర్గా ఎంట్రీ ఇచ్చి భారత క్రికెట్ చరిత్రలో గర్వించదగ్గ క్రికెటర్ గా  ప్రస్థానం కొనసాగించాడు. ఇక తన కెప్టెన్సీలో టీమిండియా కి ఎన్నో మరుపురాని విజయాలను అందించిన మహేందర్ సింగ్ ధోని ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పడంలోనే అతిశయోక్తి లేదు. రెండు వరల్డ్ కప్పులను కూడా టీమిండియా కు అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోని సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 మహేంద్రసింగ్ ధోని తర్వాత ఇప్పుడు వరకు ఎవరూ కూడా టీమిండియా కు వరల్డ్ కప్ అందించలేకపోయారు అని చెప్పాలి. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నాడు అంటే చాలు తప్పకుండా టీమిండియా  గెలుస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండేది. కేవలం కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఒక ఫినిషర్ గా ఒక గొప్ప వికెట్ కీపర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే మహేంద్రసింగ్ ధోని గొప్ప కెప్టెన్ అయినప్పటికీ ఇక కొంతమంది ఆటగాళ్ల విషయంలో వివక్ష చూపాడని ధోని వల్లే కొంతమంది కెరియర్ నాశనమైంది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వైరల్ గా కూడా మారిపోయాయి.


 ఇకపోతే లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్  వైరల్ గా మారిపోయింది. ఇర్ఫాన్ పఠాన్ కెరియర్ నాశనం కావడానికి ధోని, మేనేజ్మెంట్ ఒక కారణం అంటూ చెప్పుకొచ్చాడు. 29 ఏళ్ళ ఏజ్ లో ఇర్ఫాన్ పటాన్ తన కెరీర్ లోనే చివరి మ్యాచ్ ఆడాడు అంటే నమ్మశక్యంగా లేదు. అతను నెంబర్ ఏడవ స్థానంలో పర్ఫెక్ట్ ప్లేయర్ ఇలాంటి ఆటగాడు కావాలని ఏ జట్టు అయిన కోరుకుంటూ ఉంది. టీమ్ ఇండియా మాత్రం రవీంద్ర జడేజా బిన్నిని ఆడించింది అంటూ సదరు అభిమానులు చెప్పుకొచ్చాడు. దీనిపై ఇర్ఫాన్ పటాన్స్ స్పందిస్తూ ఎవరిని నిందించొద్దు మీ ప్రేమకు థాంక్యూ అంటూ ఒక పోస్ట్ పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: