టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక భారీ బడ్జెట్ సినిమాను తలపించింది అన్న విషయం తెలిసిందే. సాధారణంగానే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని ప్రేక్షకులు నమ్ముతూ ఉంటారు. అయితే ఇక నిన్న వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ అయితే మాత్రం పైసా వసూల్ మ్యాచ్ గా మారిపోయింది. చివరి బంతి వరకు కూడా ప్రేక్షకులను ఉత్కంఠతో మునివేళ్లపై నిలబెట్టగలిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రపంచం మొత్తం కనురెప్ప వాల్చకుండా ఇక మ్యాచ్ ని ప్రతి బంతిని కూడా కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 టికెట్లు కొనుక్కున్నవారు అటు మెల్బోర్న్ స్టేడియంలోకి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తే... మరి కొంతమంది ఇంట్లో ఉన్న టీవీ ముందు స్నేహితులతో కలిసి కూర్చొని మ్యాచ్ వీక్షించారు అని చెప్పాలి. మరి కొంతమంది ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా మ్యాచ్ ప్రసారం కావడంతో ఇక తాము ఉన్న చోటు నుంచే మొబైల్స్ లో కంప్యూటర్స్ లో ఇక ఈ మ్యాచ్ ను వీక్షించారు అని చెప్పాలి.  కాగా పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటే చాలు అటు వ్యూయర్షిప్ లో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను కొల్లగొడుతుంది అన్నది అందరికీ తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇటీవలే అధికారిక బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ పంట పండించింది అన్నది తెలుస్తుంది. రికార్డు వ్యూయర్షిప్ తో సరికొత్త చరిత్ర సృష్టించింది.  ఓటిటి ప్లాట్ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గత రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేసింది అని చెప్పాలి. ఆసియా కప్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ 1.3  కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్ 2022, సీజన్ గత టి20 వరల్డ్ కప్ వ్యూయర్షిప్ రికార్డులను బద్దలు కొట్టింది.  ఇక ఇప్పుడు వరల్డ్ కప్  భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ 1.80 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక హాట్స్టార్ లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే టిఆర్పి రేటింగ్స్ లో స్టార్ స్పోర్ట్స్ కి రికార్డు లాభాలు తప్పకుండా వచ్చి ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: