ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 12 మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ చివరికి సెమీఫైనల్ అడుగు పెట్టకుండా కేవలం లీగ్ మ్యాచ్ లతోనే ఇంటి బాట పట్టిన జట్లలో అటు బంగ్లాదేశ్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు జట్లు కూడా నాలుగు పాయింట్తో కొనసాగినప్పటికీ కూడా పాకిస్తాన్ తో పోల్చి చూస్తే అటు బంగ్లాదేశ్ కి రన్ రేట్ కాస్త తక్కువగా ఉంది. అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్తాన్కు ఉన్నట్లుగానే బంగ్లాదేశ్ కి కూడా సెమిస్ చేరే అవకాశం వచ్చింది.


 కానీ బంగ్లాదేశ్ మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది అని చెప్పాలి. ఒకవేళ పాకిస్తాన్ పై మంచి ప్రదర్శన చేసి విజయం సాధించి ఉంటే.. ఎలాంటి సమీకరణాలు లేకుండానే సెమీఫైనల్ అడుగుపెట్టేది బంగ్లాదేశ్ జట్టు. కానీ ఎందుకో బంగ్లాదేశ్ మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. కీలకమైన  మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన ఫీల్డింగ్ తప్పిదం, బౌలింగ్ వైఫల్యం జట్టును ఓటమి వైపు నడిపించాయి. కాగా బంగ్లాదేశ్ ఆటగాళ్ల ప్రదర్శన పై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి.


 ఇక ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్  మాజీ బౌలర్ వసీం అక్రమ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను బంగ్లాదేశ్ కెప్టెన్ గా లేకపోతే కోచ్గా ఉండి ఉంటే మాత్రం ముందుగా బంగ్లాదేశ్ జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరిని కూడా సైకాలజిస్ట్ కు చూపించేవాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల కీలకమైన పోరులో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల ప్రదర్శన ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండు వికెట్ల నష్టానికి 73 పరుగుల వద్ద ఉన్న సమయంలో బాంగ్లాదేశ్ దాదాపు 160 పరుగులు చేస్తుందని అనుకున్న.. కానీ వరుసగా వికెట్లు కోల్పోయి 127 కే పరిమితం కావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వసీం అక్రమ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: