గత కొంత కాలం నుంచి న్యూజిలాండ్ క్రికెట్ లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఇక ఆ జట్టు యాజమాన్యానికి ఊహించని షాకులు ఇస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా కఠిన నిబంధనలు ఉన్న కారణం గా ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తమకు విముక్తి కల్పించాలి అంటూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకి ఆటగాళ్లు అభ్యర్థులను పెడుతూ ఉండడం ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలీ. ఇప్పటికే పలువురు స్టార్ క్రికెటర్లు ఇలా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.


 ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్ తరఫున స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న మరో ఆటగాడు ఇక సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేయమని కోరుతూ జట్టు యాజమాన్యానికి అభ్యర్థన చేసుకున్నాడు అని చెప్పాలి. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తరఫున మార్టిన్ గప్తిల్  స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. తన అద్భుతమైన ప్రదర్శన తో జట్టు విజయం లో కీలక పాత్ర వహిస్తున్నాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తనను రిలీజ్ చేయాలి అంటూ ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును కోరాడు మార్టిన్ గప్తిల్. ఇకపోతే ఈ స్టార్ ప్లేయర్ అభ్యర్థులను ఆ దేశ క్రికెట్ బోర్డు అంగీకరిస్తు నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే మార్టిన్ గప్తిల్ ను సెంట్రల్ కాంటాక్ట్ నుంచి రిలీజ్ చేసింది అని చెప్పాలి. దీంతో మార్టిన్ గప్తిల్ న్యూజిలాండ్ జట్టుకు దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.  అయితే ఐపీఎల్ లాంటి లీగ్స్ లో రాణించాలనే ఉద్దేశం తోనే కాంట్రాక్టు రద్దు చేసుకున్నాడు మార్టిన్ గప్తిల్. ఇప్పటికే బౌల్ట్, గ్రాండ్ హోమ్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: