గత కొంతకాలం నుంచి ప్రపంచ క్రికెట్లో రెండు మెగాటోర్నీల గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో విషయంలో ఆతిథ్యం వహిస్తున్న రెండు జట్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఆ మెగా టోర్ని లు  ఏవో కాదు ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్.పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక అందరూ ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. దశాబ్ద కాలానికి పైగానే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి.


 ఈ క్రమంలోనే ఈ రెండు జట్లు కేవలం మెగా టోర్నీలలో తప్ప ఒక దేశ పర్యటనకు మరొక జట్టు వెళ్లడం అసలు జరగదు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక ఆసియా కప్ పాకిస్తాన్లో.. వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుండడంతో ఈ రెండు జట్ల యాజమాన్యాలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారగా.. ఆసియా కప్ కోసం తాము పాకిస్తాన్ వెళ్ళబోము అంటూ ఇప్పటికే టీమిండియా యాజమాన్యం ప్రకటించింది. ఇక ఇదే విషయంపై ఇప్పటివరకు ఎంతమంది పాకిస్తాన్ మాజీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమిజ్ రజా మరోసారి టీం ఇండియా పై తన అక్కస్ను వెళ్లగక్కాడు. పాకిస్తాన్లో జరిగే ఆసియా కప్ కోసం భారత్ వస్తేనే ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ కోసం మేము భారత్ లో అడుగుపెడతాం అంటూ స్పష్టం చేశాడు. ఒకవేళ భారత్ మా దేశానికి రాకపోతే.. మేం కూడా ఇండియా వెళ్ళము. మేం లేకుండా వాళ్లు ప్రపంచకప్ ఎలా ఆడతారు. ఇక ఆ వరల్డ్ కప్ ని ప్రేక్షకులు ఎలా చూస్తారు అంటూ రమిజ్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: