భారత బౌలింగ్ విభాగాన్ని సరికొత్త పుంతలు తొక్కించిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే ఇక జస్ ప్రీత్ బుమ్రా అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే భారత జట్టులోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు జస్ ప్రీత్ బుమ్రా.  ఏకంగా బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ బ్యాట్స్మెన్లు అందరికీ కూడా సింహా స్వప్నంలా మారిపోయాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. ఇక జస్ ప్రీత్ బుమ్రా ఏ ముహూర్తాన భారత జట్టులోకి అడుగు పెట్టాడో కానీ ఇక అతని బౌలింగ్ తో భారత జట్టును గెలిపించే కీలక ఆటగాడిగా మారిపోయాడు.


 ఇక టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా, యార్కర్ల కింగుగా కూడా బుమ్రా కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పాలి. అలాంటి బుమ్రా గత కాలం క్రితం జట్టుకు దూరమయ్యాడు. వెనునొప్పి గాయం కారణంగా ఆస్పత్రి పాలైన బుమ్రా  మళ్ళీ కోలుకొని జట్టులోకి వచ్చాడు. కానీ అంతలోనే పాత గాయం తిరగబెట్టడంతో చివరికి వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక బుమ్రా లాంటి కీలక బౌలర్ లేకుండానే బరిలోకి దిగింది టీమ్ ఇండియా జట్టు అని చెప్పాలి. చివరికి సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే వెన్నునొప్పి గాయం కారణంగా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నా బుమ్రా మళ్ళీ ఎప్పుడు మైదానంలోకి దిగబోతున్నాడు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇక అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ అందింది. బుమ్రా గాయం నుంచి కోలుకున్నాడని తెలుస్తుంది. అయితే ఫిట్నెస్ సాధించేందుకు గ్రౌండ్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన వర్కౌట్ లకు సంబంధించిన వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా వచ్చే ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్లో బుమ్రా మళ్ళీ టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: