సాధారణంగా క్రికెటర్లకు సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సిని సెలబ్రిటీలతో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా కాస్త ఎక్కువగానే గుర్తింపు ఉంటుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్లుగా కొనసాగుతున్న వారికి సంబంధించి ఎన్నో వార్తలు ఎప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆట తీరుకు సంబంధించిన వార్తలు మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి కూడా అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇండియా వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ బాలీవుడ్ స్టార్ హీరో అయిన సునీల్ శెట్టి కూతురు అతియ శెట్టి తో ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే కొన్నాళ్లపాటు వీరి ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గానే ఉంచినప్పటికీ ఆ తర్వాత మాత్రం మీడియా కనిపెట్టడంతో ఇక అందరి ముందే చట్టపట్టలేసుకొని తిరుగుతుంది ఈ జంట.


 మరికొన్ని రోజుల్లో వీరు పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక వీరికి పెళ్లికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనల్లో కేఎల్ రాహుల్ బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటన ముగిసిన వెంటనే జనవరిలో సునీల్ శెట్టి కూతురు అతీయ శెట్టి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడట టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్. పెళ్లి కోసం సెలవులు కోరగా అటు బీసీసీఐ కూడా అంగీకరించిందట. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా వెళ్ళబోయే శ్రీలంక టూర్కు అతను దూరం కాబోతున్నాడు అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: