ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియాకు మొదటి అడుగులోనే చేదు అనుభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్ గెలిచి ఇక వన్డే సిరీస్ లో ఓడిపోయి ఒక మోస్తారు ప్రదర్శన చేసిన టీమిండియా అటు బంగ్లాదేశ్ పర్యటనలో మాత్రం దుమ్ము రేపుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా అందరి అంచనాలను తారుమారు చేసేసింది. ఇటీవల ఆడిన వన్ డే సిరీస్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది టీమిండియా.


 దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే అటు టీమిండియా బంగ్లాదేశ్ జట్టుకు సిరీస్ కట్టబెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అభిమానులు అందరూ కూడా తీవ్రస్థాయిలో నిరాశలొ మునిగిపోయారు. టీమిండియా నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదు అంటూ ఇక సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే చేతికి గాయమైనప్పటికీ చివర్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ కు వచ్చి హాఫ్ సెంచరీతో పోరాడిన జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే రెండో వన్డే మ్యాచ్లో ఓటమి అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఓటమి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు మెహదీ హసన్, మహమ్మదుల్లా పార్టనర్ షిప్ కొంప ముంచింది అంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్దరిని అవుట్ చేయకపోవడమే టీమ్ ఇండియా ఓటమిక కారణం అంటూ వెల్లడించాడు. 69 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో ఇక మళ్ళీ పుంజుకుని 270 పరుగులు చేయడం గొప్ప విషయం అన్నాడు. ఇక టీమిండియా బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయాం అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. మొదట్లో బాగానే బౌలింగ్ చేసినప్పటికీ మిడిల్ డెత్ ఓవర్లలో మాత్రం పరుగులు కట్టడి చేయడంలో బౌలర్లు విఫలమయ్యారని చెప్పుకొచ్చాడు. మొదటి వన్డే మ్యాచ్ లొ కూడా ఇదే తప్పిదాన్ని చేశారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: