
ఇషాన్ కిషోర్ డబుల్ సెంచరీ చేయడం వల్లే అటు భారత జట్టు ఇక భారీ స్కోరు చేయగలిగింది. ఇకపోతే ఇటీవలే మ్యాచ్ ముగిసిన ఇండియా యువ ఆటగాడు శుభమన్ గిల్ ఇషాన్ కిషన్ నూ ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ ముందు ప్రాక్టీస్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు ఇషాన్ కిషన్. ఇలా మూడో వన్డే మ్యాచ్లో భారీ పరుగులు చేయడంలో తాను సూర్య కుమార్ యాదవ్ ప్లాన్ అమలు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. మొన్నటి మ్యాచ్ జరిగిన సమయంలో నెట్స్ లో సరిగ్గా వికెట్లు తీయలేకపోయాం.
కాబట్టి మ్యాచ్ జరగనున్న రోజు ఉదయం నెట్స్ లో సాధన చేయాలని అనుకున్నాను. నాతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా సాధన చేశారు. అందుకే ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చాలా సులువుగా మారింది. ఇక సూర్య కుమార్ యాదవ్ సైతం టి20 ప్రపంచ కప్ సమయంలో ఇలా మ్యాచ్ రోజున సాధన చేయడం నేను చూశాను. అతను వరల్డ్ కప్ లో గొప్పగా రాణించాడు. ఇక నేను అతడిని అనుసరించి బంగ్లాదేశ్ తో మూడో వన్డే మ్యాచ్ రోజే సాధన చేశాను. ఇక తర్వాత మ్యాచ్లో డబుల్ సెంచరీ నమోదు చేయగలిగాను అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.