గత కొంతకాలం నుంచి పరిమిత ఓవర్లో ఫార్మాట్లో వరుసగా సిరీస్ లు ఆడుతున్న టీమిండియా జట్టు ఇక మరికొన్ని రోజుల్లో టెస్ట్ సిరీస్ లు ప్రారంభించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు ఇటీవలే వన్డే సిరీస్ ముగించుకుంది. ఇక రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్ లో ఓడిపోయినప్పటికీ అటు టెస్టు సిరీస్ మాత్రం టీమిండియా కు ఎంతో కీలకంగా మారబోతుంది.


 ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరులో నిలవాలి అంటే మాత్రం టీమిండియా  తప్పనిసరిగా బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. కేవలం బంగ్లాదేశ్ తో ఆడబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మాత్రమే కాదు మొత్తంగా టీమ్ ఇండియా ఆడబోయే ఆరు టెస్ట్ మ్యాచ్ లలో కూడా ఐదు మ్యాచ్ల్లో విజయ డంక మోగించాల్సి ఉంది. ఇక ఇలా ఐదు విజయాలు సాధించలేదు అంటే చాలు ఇక టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.


 ఇకపోతే ఇప్పటికే భారత దయాది దేశమైన పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతి లో టెస్ట్ సిరీస్ ఓడి పోయి చివరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ప్రస్తుతం టీమిండియా ప్రస్థానం ఎలా కొనసాగించ బోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా తో జరిగే టెస్ట్ సిరీస్ లో కూడా గెలవాలి.. ఏకంగా 4-0 తేడాతో లేదంటే 3-1 లేదంటే 3-0 తేడాతో టీమిండియా భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో విజయం సాధించాల్సి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: