ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఎప్పుడు ఏ ఆటగాడికి ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది అన్నది ఊహకిందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ఆటగాడికి ఇక ప్రస్తుత సీజన్లో కోట్ల రూపాయలు ధర పలకడం.. అదే సమయంలో గత సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఇక ప్రస్తుత సీజన్లో ఏ ఫ్రాంచైజీ   కూడా ముందుకు రాకపోవడం లాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఐపీఎల్ కు సంబంధించిన మినీ వేలం జరుగుతుంది అంటే చాలు అభిమానులు అందరూ కూడా భారీగా అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇక 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన మినీ వేలంలో కూడా ఇక ఇలాంటి అంచనాలకు మించిన ధర పలికిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి ఆటగాళ్లలో వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్  కూడా మొదటి వరుసలో ఉంటాడు. గత ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు నికోలస్ పూరన్.  పవర్ హిట్టర్ గా పేరున్న నికోలస్ పూరన్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తమ టీం లోకి తీసుకుంది. కానీ ఎక్కడ అతను అంచనాలు మాత్రం అందుకోలేకపోయాడు.  పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. అలాంటి ఆటగాడిని ఈ ఏడాది ఏ ఫ్రాంచైజీ  కొనుగోలు చేయదని  అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో ఐపీఎల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో నికోలస్ పూరన్ కు 16 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక ఇటీవల దీనిపై లక్నో మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా నికోలస్ పూరన్ ను కొనుగోలు చేయడాన్ని సమర్ధించుకున్నాడు. గత సీజన్ ప్రదర్శనతో సంబంధం లేదని.. నికోలస్ పూరన్ సత్తా గలిగిన ఆటగాడు అంటూ గంభీర్ వ్యాఖ్యానించాడు. కీలక మ్యాచ్ లలో అద్భుతంగా రానించి జట్టును గెలిపించే సత్తా అతనికి ఉంది అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: