
అయితే ఇక ఈ ఏడాది కూడా టి20 ఫార్మాట్లో అదే తరహా విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక వన్డే ఫార్మాట్లో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టు కుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఆస్ట్రేలియా తో జరగబోయే టెస్టు సిరీస్లో ఇక సుదీర్ఘమైన ఫార్మాట్లోకి అరంగేట్రం చేసేందుకు కూడా సిద్ధ మవుతూ ఉన్నాడు. అయితే ఇటీవలే ఐసీసీ ప్రకటించిన అరుదైన అవార్డు సూర్య కుమార్ యాదవ్ దక్కించుకోవడం తో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అతని ప్రతిభ పై స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయం పై టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ ఆశిష్ నెహ్ర సైతం స్పందించాడు.
పొట్టి ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ రెండేళ్లుగా సూర్యుడి లా నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నాడు అంటూ భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్ర ప్రశంసలు కురిపించాడు. ఒకే రకమైన ఫామ్ను కొనసాగిస్తూ నిలకడగా రాణిస్తూ ఇక అత్యధిక స్ట్రైక్ రేటు నమోదు చేయడం గొప్ప విషయం అంటూ చెప్పు కొచ్చాడు. ఇదే ఆట తీరును కొనసాగిస్తే రానున్న రోజుల్లో అన్ని ఫార్మాట్ల లో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసు కోవడం ఖాయం అంటూ ఆశిష్ నెహ్ర తెలిపాడు. మరి కొంత మంది మాజీ క్రికెటర్లు సైతం సూర్య కుమార్ యాదవ్ అవార్డు విన్నింగ్ పై ప్రశంసలు కురిపించారు.