సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే క్రికెటర్లకు కాస్త ఎక్కువగానే సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంటుంది. ఎందుకంటే సినీ సెలెబ్రెటీలు అంటే కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం అయి ఉంటారు. కానీ క్రికెటర్లు మాత్రం తమ ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల్లో క్రేజ్ సంపాదించుకుంటూ ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకే క్రికెటర్లకు సంబంధించిన ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఎంతోమంది స్టార్ క్రికెటర్లు స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే మైదానంలోకి దిగినప్పుడు ఒక సాదాసీదా క్రికెటర్ గా నార్మల్ లుక్ లో కనిపించే క్రికెటర్లు ఇలా ఒక్కసారిగా స్టైలిష్ లుక్ లో హీరోలాగా కనిపించడంతో అభిమానులు అలాంటి ఫోటోలను చూసి ఫిదా అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక ఫోటో ఇలాంటిదే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఇలా వైరల్ గా మారిపోయిన ఫోటోలో కెప్టెన్ రోహిత్ శర్మ న్యూ స్టైలిష్ లుక్ చూసి ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ఫిదా అవుతూ ఉన్నారు అని చెప్పాలి. మైదానంలో ఎంతో సాదాసీదాగా కనిపించే రోహిత్ శర్మ ఇక ఈ ఫోటోలో మాత్రం ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నాడు. ఒకరకంగా సినిమా హీరో లాగే ఉన్నాడు అని చెప్పాలి.  దీంతో ఈ ఫోటో అభిమానులు తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు రోహిత్ సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. ఇక తన మునుపటి ఫామ్ నిరూపించుకున్న రోహిత్ శర్మ ఇటీవల న్యూజిలాండ్తో మూడో వన్డేలో  సెంచరీ తో అదరగొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: