
ఇక టీమిండియా తరఫున ఎన్నో మంచి ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు అద్భుతమైన విజయాలు అందించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సురేష్ రైనా అటు అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ ఏదో ఒక విధంగా ఇంకా క్రికెట్ కి దగ్గరగానే ఉంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ లో ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ తనలో ఇంకా సత్తా తగ్గలేదు అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తో నిరూపిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవలే ఘజియాబాద్ వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలో మరోసారి సురేష్ రైనా అదరగొట్టారు. ఇండోర్ నైట్స్ తరఫున బ్యాటింగ్ చేసిన అతను 45 బంతుల్లోనే 10 ఫోర్లు నాలుగు సిక్సర్లతో 90 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ మిస్ అయ్యాడు. ఇక ఆ జట్టు 20 ఓవర్లలో 209 పరుగులు సాధించింది అని చెప్పాలి. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన నాగపూర్ నింజాస్ జట్టు 198 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో ఓడిపోయింది. అయితే అంతకుముందు లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో కూడా సురేష్ రైనా బ్యాటింగ్లో ఫీల్డింగ్ లో మెరిసాడు అని చెప్పాలి.