కానీ ఇలా ధోనితో పోల్చిన ఆటగాళ్లు సరిగ్గా రానిచకపోవడంతో ఇలాంటి ప్లేయర్లను ధోనితో పోల్చి తప్పు చేశాము అని భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేయర్ లిటన్ దాస్ గురించి కూడా అందరూ ఇలాగే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం భాగిస్తున్నాడు లిటన్ దాస్. ఇతని కూడా వికెట్ కీపింగ్ లో ధోనితో పోల్చారు ఎంతోమంది. కానీ ఇటీవల అతని వికెట్ కీపింగ్ వైఫల్యం చూసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. సులభమైన స్టంపింగ్ ఛాన్స్ లను కూడా జారవిడిచాడు. ఇక అతని పేలవ వికెట్ కీపింగ్ తో గెలవాల్సిన కోల్కతా జట్టు ఓడిపోయింది.
మధ్య ఓవర్లలో స్పిన్నర్లు రాణించడంతో ఢిల్లీ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది.దీంతో ఢిల్లీకి మరో ఓటమి తప్పదా అని అనుకుంటున్న సమయంలో ఇక కీపర్ గా ఉన్న లిటన్ దాస్ చేసిన పొరపాట్లు ఢిల్లీ జట్టుకు ప్లస్ పాయింట్ గా మారిపోయాయి. లలిత్ యాదవ్ ను స్టంప్ అవుట్ చేసే అవకాశం రాగా బాల్ను కనెక్ట్ చేయలేక లీటన్ దాస్ ఇబ్బంది పడ్డాడు. తర్వాత కీలకమైన అక్షర్ పటేల్ ను స్టంప్ అవుట్ రూపంలో అవుట్ చేసే అవకాశం వచ్చిన విఫలం అయ్యాడు. దీంతో ఇదంతా చూసిన ప్రేక్షకులు లీటన్ దాస్ వికెట్ కీపింగ్ పై చివాట్లు పెడుతున్నారు. సులభమైన స్టంప్ అవుట్ చేయలేకపోతున్న నీకు ధోనితో పోలిక అంట్లు కామెంట్లు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి