ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా ఒకే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది . అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి.. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఐసీసీ నిర్వహించే ఈ టోర్నీలో సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్లో విశ్వవిజేతగా నిలవాలని ప్రతి జట్టు కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఈ పోరులో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ వరకు చేరుకున్నాయని చెప్పాలి. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇంగ్లాండులోని ఓవల్ మైదానం ఇక ఈ ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పాలి.



 ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయం గురించి గత కొన్ని రోజుల నుంచి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎంతో మంది మాజీ ప్లేయర్లు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ రివ్యూలను చదివిన ప్రేక్షకుల్లో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ పై మరింత అంచనాల పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. అయితే రెండు టీమ్స్ తుది జట్టు కూర్పు ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయంపై కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు ఎంతో మంది మాజీ క్రికెటర్లు. ఇదే విషయంపై మాట్లాడాడు భారత మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్.


 గత కొంత కాలం నుంచి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. మొన్నటికీ మొన్న ఐపిఎల్ లో కూడా పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలోనే రోహిత్ ఫామ్ గురించి దిలీప్ వెంగ్ సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కి ముందు కనీసం ఒక వార్మప్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడ్డాడు. ద్వైపాక్షిక సిరీస్ మాదిరిగా ఇక్కడ రెండో అవకాశం ఉండదని.. అందుకే సన్నత చాలా అవసరమని చెప్పుకొచ్చాడు. అయితే టి20 క్రికెట్ తర్వాత నేరుగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ పై ఆందోళన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. వికెట్ కీపర్ గా కె ఎస్ భరత్ జట్టులో ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: