గతంలో రోహిత్ వారసులుగా రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హార్దిక్ సక్సెస్ అయ్యి మొదటి ప్రయత్నంలోనే టైటిల్ గెలిచిన తర్వాత ఇక కెప్టెన్సీ రేసులో అతని పేరే ముందు వరుసలోకి వచ్చేసింది. దీంతో హార్దిక్ రోహిత్ వారసుడని.. టీమిండియా తర్వాత కెప్టెన్ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయపడ్డారు. ఇక టీమిండియా సెలెక్టర్లు కూడా రోహిత్ కి విశ్రాంతి ప్రకటించిన ప్రతిసారి హార్దిక్ ను కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఇక ఇప్పుడు టి20 లకు హార్దిక్ ను పర్మినెంట్ కెప్టెన్ గా మార్చేశారు అన్నది కూడా అర్థమవుతుంది.
అయితే హార్దిక్ టెస్ట్ ఫార్మాట్ కి దూరంగా ఉంటాడు. దీంతో టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ గా ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే హార్దిక్ పాండ్యా కి వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతలు దక్కే ఛాన్స్ ఉందని అందరూ చర్చించుకున్నారు. ఇదే విషయంపై రవి శాస్త్రి స్పందించాడు. ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టాలని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ ఫిట్ గా ఉంటే వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ అందుకోవాలి. అతని శరీరం టెస్ట్ క్రికెట్కు సహకరించకపోవచ్చు. అందుకే వన్డే టీ20 లకు కెప్టెన్ గా ఉండాలి. ఇక జట్టులో సీనియర్ను పక్కన పెట్టి వన్డే టి20 లో యువకులకు అవకాశం ఇవ్వాలి అంటూ రవి శాస్త్రి సూచించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి