అయితే ఇలా చిన్నచిన్న టీమ్స్ సైతం సెమీఫైనల్ లో అడుగు పెట్టేందుకు హోరాహోరీ పోరను కొనసాగిస్తూ ఉంటే డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రపంచ కప్ టోర్నిలో అడుగుపెట్టిన ఇంగ్లాండు మాత్రం దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. వరుస ఓటములతో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులందరినీ కూడా నిరాశలో ముంచేసింది. ఇక ఇప్పటికే వరుస ఓవటములతో ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ అవకాశాలను కూడా కోల్పోయింది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ ఇంకా మ్యాచ్లు ఆడాల్సి ఉన్నప్పటికీ అవి కేవలం నామమాత్రమైన మ్యాచ్ లే కావడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ వైఫల్యం గురించి భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్ర స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది అంటూ అభిప్రాయపడ్డాడు. చిన్న జట్లపై కూడా ఇంగ్లాండు ఓడిపోవడం నిజంగా బాధాకరం. వీరు ప్రపంచ ఛాంపియన్స్ అంటే ఎవరు నమ్మరు. ఇప్పటికే ఆ జట్టు పాయింట్ల పట్టికలో అడుగున ఉంది. కింది నుంచి రెండో స్థానంలో ఉంటే ఇంగ్లాండ్ టీం ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లే. అందుకే ఇంగ్లాండ్ కనీసం పరువు నిలబెట్టుకునేందుకు అయినా ఆడాలి అంటూ రవి శాస్త్రి సూచించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి