సోషల్ మీడియా అనేది ఎన్నో వింతలు విశేషాలకు చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏ ఆసక్తికర ఘటన జరిగినా అది ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక ఇలా సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే మన కళ్ళని మనం కూడా నమ్మలేము. ఇలాంటివి కూడా జరుగుతాయా అనే భావన అందరికీ కలుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో కూడా ఇలాంటి కొవలోకి చెందినదే అని చెప్పాలి.


 క్రాప్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు  కొన్ని ప్రాంతాలలో పీత అని పిలిస్తే మరికొన్ని ప్రాంతాలలో ఎండ్రకాయ అని పిలుస్తూ ఉంటారు. ఇక ఎండ్రకాయతో కూర చేస్తే ఎంతోమంది లొట్టలేసుకుంటూ మరి తింటూ ఉంటారు అని చెప్పాలి  శీతాకాలంలో ఇలా ఎండ్రకాయల కూర ఎక్కువగా తినడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎండ్రకాయకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నెటిజెన్స్ అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే వీడియో చూస్తున్నప్పుడు మన కళ్ళను మనమే నమ్మలేనంత వింతగా ఉంది వైరల్ గా మారిపోయిన వీడియో.



 ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒకవైపు ఎండ్రకాయను నూనెలో వేసి ఫ్రై చేస్తూ ఉన్నారు. కానీ తనకేమీ తెలియదు అన్నట్లుగా ఎండ్రకాయ మాత్రం కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తూ పక్కనే ఉన్న దానిని తింటూ కనిపిస్తుంది. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే.. పీత లేదా ఎండ్రకాయను నూనెలో బాగా ఫ్రై అయ్యి కనిపిస్తుంది. అది బతికే ఛాన్స్ లేదని అందరికీ తెలుస్తుంది. కానీ ఆ పీత కి మాత్రం అది అర్థం కాలేదు. ఇలా  బతికున్నప్పుడే కడాయిలో వేసి బాగా ఉడక పెడుతుంటే పాపం అది మాత్రం ఆ సమయంలో ఎంతో దర్జాగా పక్కనే ఉన్న కంకిలోని గింజలు తింటూ కనిపించింది. చూసి అందరూ షాక్ అవుతున్నారు. వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: